జాతీయ వార్తలు

మైనర్ భార్యతో సంపర్కం నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బాలికల వివాహిత యోగ్యత వయస్సు 18 ఏళ్లయినప్పుడు ఆ లోపువయసుగల మైనర్ భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారం కాదంటూ ఏ విధంగా మినహాయింపుఇస్తారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. భారత శిక్షాస్మృతిలో 15 ఏళ్ల లోపువయసుగల భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారం కాదంటూ మినహాయింపును ఇవ్వడాన్ని నిలదీసింది. ఈ రకమైన మినహాయింపురాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు 15-18 సంవత్సరాల వయసుగల మైనర్ భార్యతో లైంగిక సంపర్కం నేరమేనంటూ బుధవారం చారిత్రక తీర్పును ఇచ్చింది. ఇందుకు సంబంధించి చట్టంలో ఉన్న మినహాయింపు యాదృచ్ఛికమేనని పైగా అది చట్ట ఉల్లంఘనే అని సుప్రీం కోర్టు బెంచ్ వెల్లడించింది. భారత శిక్షాస్మృతిలోని 375వ సెక్షన్ అత్యాచార నేరాన్ని నిర్వసిస్తున్నప్పటికీ 15 ఏళ్లు పైబడిన తన భార్యతో లైంగిక సంపర్కం మానభంగం కాదన్న మినహాయింపుఇందులో ఉంది. అయితే లైంగిక సంపర్కానికి ఆమోదయోగ్యమైన వయస్సు 18 సంవత్సరాలని ఈ చట్టం చెబుతోంది. ఈ అంశాన్ని విచారించిన సుప్రీం కోర్టు అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టంలో ఈ మినహాయింపుసమర్ధనీయం కాదని, ఆ బాలిక శారీరక సమగ్రతను దెబ్బతీసేదే అవుతుందని
సుప్రీం కోర్టు తెలిపింది. న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం దేశంలో బాల్య వివాహాల సంస్కృతి ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక న్యాయానికి సంబంధించిన చట్టాలు ఉద్దేశిత స్ఫూర్తితో అమలుకావడం లేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. తాము వైవాహిక అత్యాచార అంశాన్ని చేపట్టడం లేదని న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ అంశంపై తన తీర్పును విడిగా రాసిన న్యాయమూర్తి దీపక్ గుప్తా‘అన్ని చట్టాల్లోనూ వివాహిత యోగ్యత వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ ఐపిసిలో ఇందుకు మినహాయింపుఇవ్వడం ఆ బాలిక హక్కులను ఉల్లంఘించడమే. ఈ మినహాయింపు ఒక రకంగా ఆలోచనారహితమైన ఏకపక్ష నిర్ణయమే’అని అన్నారు. ఈ మినహాయింపుభారత రాజ్యాంగంలోని 14,15, 21వ అధికరణలను ఉల్లంఘిస్తోందని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. దేశ వ్యాప్తంగా బాల్య వివాహాలను నిరోధించేందుకు గుణాత్మక రీతిలో చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను బెంచ్ ఆదేశించింది. అక్షయ తృతీయ సందర్భంగా వేలాది మంది మైనర్ బాలికలు సామూహిక వివాహాలు చేయడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేసింది. ఓ పక్క వివాహ యోగ్యత వయసు 18 సంవత్సరాలు అయినప్పుడు 15-18 సంవత్సరాల్లోపుమైనర్ భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారం కాదని పార్లమెంటు ఏ రకంగా మినహాయింపుఇస్తుందంటూ గతంలో ప్రశ్నించిన కోర్టు తన తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే.