జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం అంటే ప్రజా భాగస్వామ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: పట్టణ ప్రాంతాల్లోని సౌకర్యాలన్నీ పల్లెల్లోనూ కల్పించేందుకు అంద రం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. బుధవారం ఢిల్లీ లో నిర్వహించిన నానాజీ దేశ్‌ముఖ్ జయంత్యుత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ, లక్ష్య సాధనకు సమగ్ర కృషి జరగాలని, ఫలితాలు వచ్చే లా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపకరించే పోర్టల్, యాప్‌లను ప్రారంభించారు. జిల్లాస్థాయి, పంచాయతీ స్థాయిలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలును సమీక్షించే ‘దిశ’ డాష్‌బోర్డ్ పోర్టల్, ‘గ్రామ సంవాద్’ యాప్‌లను ప్రారంభించారు. మోదీ తొలుత నానాజీ దేశ్‌ముఖ్‌తోపాటు సంపూర్ణ విప్లవం నినాదమిచ్చిన జయప్రకాశ్ నారాయణ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ‘మనకు వనరుల కొరత ఎంత మాత్రం లేదు. దేశంలో కావలసినన్ని నిధులు, వనరులున్నాయి. సుపరిపాలన
ద్వారా వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని ఉద్బోధించారు. దేశాభివృద్ధికి మంచి ఆలోచనలు, పథకాలు ఉన్నంత మాత్రాన సరిపోదని, వాటిని సకాలంలో సమర్థంగా పూర్తిచేయటం ద్వారా అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులకు అందుతాయన్నారు. పారిశుద్ధ్య సౌకర్యాల కొరత గ్రామీణ ప్రాంతాభివృద్ధికి అడ్డంకిగా మారిందని, పెద్దఎత్తున మరుగుదొడ్లు నిర్మించటం ద్వారా సమస్యను అధిగమించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ప్రజాభాగస్వామ్యం ముఖ్యమంటూ, అభివృద్ధి ప్రజాభాగస్వామ్యం కరవైతే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని ఓట్ల బలంతో ప్రజాస్వామ్యం పటిష్టం కాదంటూనే, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల మధ్య చర్చ అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. నానాజీ దేశ్‌ముఖ్, జయప్రకాశ్ నారాయణ్ దేశాభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేశారని, గ్రామాల స్వయం సమృద్ధికి, పేదరికం తొలగింపునకు నానాజీ దేశ్‌ముఖ్ అవిరళ కృషి చేశారని మోదీ ప్రశంసలు కురిపించారు. నానాజీ దేశ్‌ముఖ్, జయప్రకాశ్ నారాయణ్ తమ లక్ష్య సాధనకోసం సర్వస్వాన్నీ త్యాగం చేశారని మోదీ చెప్పారు. జయప్రకాశ్ నారాయణ్ పదవులను ఆశించకుండా దేశ యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు. పదవులు, అధికారాన్ని ఆశిస్తే దేశానికి సేవ చేయలేమని వారు భావించారని వెల్లడించారు.