జాతీయ వార్తలు

పండగే పండగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:కేంద్ర,రాష్ట్ర, యూజీసీ పరిధిలోకి వచ్చే ఉన్నత విద్యా సంస్థల ప్రొఫెసర్లకు ఏడో వేతన సంఘం సిఫార్సులను వర్తింప చేయడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు ఎనిమిది లక్షల మందికి పది వేల నుంచి 50వేల వరకూ జీతాలు పెరుగుతాయి. యుజిసి, కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ నిధులతో నడిచే 106 వర్సిటీలు, కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే 329 వర్సిటీలు, అలాగే రాష్ట్ర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న 12,912ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బందికి ఈ కొత్త వేతనాలు వర్తిస్తాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటిలు, ఐఐఎమ్‌లు, ఐఐఎస్‌ఇఆర్‌లు, ట్రిపుల్ ఐటిలు సహా 119 సాంకేతిక సంస్థల్లోని బోధనా సిబ్బందికి కూడా సవరించిన యూజీసి వేతనాలు వర్తిస్తాయని జనశక్తి వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ బుధవారం నాడిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు.
2016 జనవరి ఒకటి నుంచి వర్తించేలా కొత్త వేతనాలను అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సిఫార్సుల అమలు వల్ల వార్షికంగా కేంద్ర ఖజానాపై 9,800కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడుతుందన్నారు. కొత్త వేతనాల వల్ల రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని కేంద్రం భరిస్తుందని, దేశంలో ఉన్నత విద్యా, సాంకేతిక సంస్థల్లో బోధనాపరమైన నాణ్యతను పెంపొందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జవడేకర్ వెల్లడించారు. అలాగే ఎక్కువ జీతాల కోసం ఈ విద్యా సంస్థల నుంచి నిపుణులైన బోధనా సిబ్బంది తరలి పోకుండా కూడా ఈ జీతాల పెంపు నిరోధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.