జాతీయ వార్తలు

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు లౌకిక, భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, అప్పట్లో ప్రజాస్వామ్యానికి ఎంతటి ముప్పువాటిల్లిందో ఇప్పుడూ అదే పరిస్థితి ఉందని హెచ్చరించారు.
ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తేవడం సాధ్యం కాని పక్షంలో గరిష్ట సంఖ్యలో ఈ పార్టీల మధ్య ఐక్యతను సాధించి బిజెపిని ఓడించాలని జెడియూ నేత శరద్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 2019లో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తేవడం జయప్రకాశ్ నారాయణ్‌కు ఇచ్చే అతిపెద్ద నివాళి అవుతుందని ఆయన 115 జయంతి సందర్భంగా జరిగిన ఓ సంస్మరణ సభలో శరద్ యాదవ్ అన్నారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ జయప్రకాశ్ నారాయణ్ ఏకం చేశారని ఏచూరి గుర్తు చేశారు. నిజానికి ఎమర్జెన్సీ కాలం నాటి పరిణామాల కంటే కూడా ప్రస్తుత పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశంలోని అన్ని వర్గాలూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని ఏచూరి అన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నదే బిజెపి, దాని సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని పేర్కొన్న ఏచూరి 2019 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల్ని మతపరంగా చీల్చేందుకూ ఇవి వెనుకాడే అవకాశం లేదని అన్నారు. ప్రతిపక్షాలు కలిసి నడవక పోయినా కనీసం లౌకిక భావాల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. బిజెపిని ఓడించాలన్న లక్ష్యంతోనే అన్ని ప్రతిపక్ష పార్టీలూ పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
యని తెలిపారు.