జాతీయ వార్తలు

ఒమన్‌లో భారత యుద్ధ నౌకల విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: పశ్చిమ నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ఒమన్‌లో అక్కడి నౌకాదళంతో విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఒమన్ రాయల్ నేవీతో కలిసి మస్కట్‌లో శనివారం నుంచి నిర్వహిస్తున్న విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ తారకేష్, ఐఎన్‌ఎస్ దీపక్ నౌకలు పాల్గొంటున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఒమన్‌లో పర్యటించనున్న సందర్భంగా ఈ విన్యాసాలు చేపట్టడం గమనార్హం. ఈ బృందానికి పశ్చిమ నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ రియర్ అడ్మిరల్ రణవీత్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన నౌకాదళాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు.