జాతీయ వార్తలు

సారథులు మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: నవ భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గవర్నర్లకు పిలుపిచ్చారు. విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆవిష్కరణలకు నిలయాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్టప్రతి భవన్‌లో గురువారం జరిగిన గవర్నర్ల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. 2022 నాటికి నవ భారతాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే దీనిని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని గవర్నర్లకు సూచించారు. గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజాభివృద్ధికి తోడ్పడవచ్చునని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మార్పునకు గవర్నర్లు దోహదకారులుగా మారాలని సూచించారు. నవ భారత నిర్మాణానికి అవసరమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని,ఈ లక్ష్య సాధనకోసం గవర్నర్లు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, చర్చలు జరపాల్సిన అవసరం ఎంతో ఉందని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు, దళితులు, మహిళలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలిచ్చే విధంగా బ్యాంకులను ప్రోత్సహించాలన్నారు. రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకునే నవంబర్ 26వ తేదీ నుండి అంబేద్కర్ మహాపరినిర్వాణ
దినంగా జరుపుకునే డిసెంబర్ 6వ తేదీల మధ్య రుణాల పంపిణీకి బ్యాంకులు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని నరేంద్ర మోదీ చెప్పా రు. సమస్యల పరిష్కారానికి విద్యార్థులు సాంకేతిక పరిష్కారాలు ప్రతిపాదించిన హెకథాన్ గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ముఖాముఖి చర్చల వలన మంచి ఫలితాలు ఉంటాయని
ప్రధాన మంత్రి తెలిపారు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలన్నారు. ప్రతి రాష్ట్రంలోని విద్యార్థులు తమ చదువులతోపాటు ఏదో ఒక క్రీడపై దృష్టి కేంద్రీకరించాలని హితవు చెప్పారు. గవర్నర్లు పరిశుభ్రతకు ఉదాహణలుగా మారాలని అన్నారు. 2019లో జరిగే జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతినాటికి దేశం యావత్తు బహిరంగ మల మూత్ర విసర్జన రహితం కావాలన్నారు. పండుగలు, జయంతి ఉత్సవాలు నవ భారత నిర్మాణానికి ప్రేరకాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
సౌర ఇంధనం, డిబిటి తదితర పథకాల విజయానికి తోడ్పడాలని, కేంద్ర పాలిత ప్రాంతాలను కిరోసిన్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్లకూ మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటిలోనూ అత్యంత వేగంగా వీటిని అమలు చేయాలని ఉద్ఘాటించారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో రాష్టప్రతి కోవింద్, ప్రధాని మోదీ, ప్రభృతులు