జాతీయ వార్తలు

తల్వార్‌లు నిర్దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్, పనివాడు హేమ్‌రాజ్ జంట హత్యల కేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు నుపుర్, రాజేష్ తల్వార్‌లను ఎట్టకేలకు నిర్దోషులుగా విడుదలయ్యారు. 2008నాటి ఈ సంచలన పరువు హత్య కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ దంపతులను దోషులుగా నిర్థారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష వేసిన ఘజియాబాద్ సిబిఐ కోర్టు నాలుగేళ్ల క్రితం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఉన్న సాక్ష్యాల ప్రకారం దోషుల్ని శిక్షించలేమని, వీరికి సంశయ లాభ సూత్రం వర్తిస్తుందని న్యాయమూర్తులు బికె నారాయణ, ఎకె మిశ్రాలు తమ తీర్పును వెలువరించారు. అరుషి, హేమ్‌రాజ్ హత్య కేసులో నోయిడాకు చెందిన ఈ దంపతులను దోషులుగా నిర్థారిస్తూ ఘజియాబాద్ సిబిఐ కోర్టు 2013 నవంబర్ 26న తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ దాస్నా జైల్లో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. తాజా తీర్పుతో తొమ్మిదేళ్ల ఈ కేసుకు తెరపడినట్టయింది. ఈ కేసును విచారించి హైకోర్టు గత నెల ఏడున తన తీర్పును వాయిదా వేసింది. పధ్నాలుగేళ్ల అరుషి హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, హైకోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని సిబిఐ ప్రకటించింది.