జాతీయ వార్తలు

హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి, మే 21: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రామచంద్రపురం(గోదావరిపేట) వద్ద శనివారం మధ్యాహ్నం తిరుచురాపల్లి-హౌరా సూపర్‌ఫాస్ట్ వీక్లీ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు చివరి జనరల్ బోగీలో చెలరేగిన ఈ మంటలను ఒక ప్రయాణికుడు వెంటనే గుర్తించి డోర్ వద్దకు వచ్చి చైన్ పుల్ చేయడంతో రైలు ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు విషయం గమనించి పరుగులు తీసారు. వెంటనే రైలు సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమై రైలు బోగీలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా మంటలు అదుపులోకి తెచ్చారు. బోగీల నుంచి దట్టమైన పొగలు రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు గోదావరిపేట గ్రామస్తులు ఆందోళన చెంది రైలు వద్దకు పరిగెత్తుకు వచ్చారు. అరగంట తరువాత రైలు తిరిగి బయలు దేరింది. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.