జాతీయ వార్తలు

బోరు ఫీజు చట్టం వచ్చేస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: భూగర్భ జలాలను ఎడాపెడా వాడకునే విధానానికి కేంద్రం చెక్ పెట్టనుంది. త్వరలో భూగర్భ జలాల సంరక్షణ పరిరక్షణ క్రమబద్ధీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ముసాయిదా పత్రులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. కేంద్రం చేయనున్న చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో చట్టాలు చేసి అమలు చేయాలని కేంద్రం సూచించింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం ప్రైవేట్ టౌన్‌షిప్‌లు, సహకార సంఘాల పరిధిలోని కాలనీలు, అపార్టుమెంట్లు, పరిశ్రమలు, రిక్రియేషన్ క్లబ్‌లు బోరు వేసి భూగర్భ జలాలను వినియోగించుకుంటే బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. భూగర్భ జలాల వినియోగ పరిణామాన్ని బట్టి ఈ బిల్లును నిర్దేశిస్తారు. కేంద్ర జలవనరుల శాఖ ఈ ముసాయిదాను రూపొందించింది. పరిశ్రమలు, మైనింగ్, వౌలిక ప్రాజెక్టులు, ప్రభుత్వేతర సంస్థలు గొట్టపు బావులను ఏర్పాటు చేయదలుచుకుంటే, తప్పనిసరిగా భూగర్భ జల శాఖ నుంచి నిరభ్యంతర ధృవపత్రాన్ని పొందాల్సి ఉంటుంది. కాని రైతులను ప్రతిపాదిత బిల్లులో మినహాయించారు. రైతులు గొట్టపు బావులను ఏర్పాటు చేసి భూగర్భ జలాలద్వారా పంటలు పండిస్తారు. అందుకే వారిని మినహాయించారు. రైతులు నిరభ్యంతర పత్రాన్ని భూగర్భ జల శాఖ నుంచి తీసుకోవాలనే నిబంధనను చేర్చలేదు. దేశంలో 33 మిలియన్లకుపైగా గొట్టపు బావులు ఉన్నట్లు ఒక అంచనా. ఈ గొట్టపుబావుల ద్వారా దాదాపు 250 క్యుబిక్ కిఎం నీటిని తోడుతున్నారు. ప్రతి ఏడాది కురిసే భారీ వర్షాల వల్ల భూగర్భంలో చేరే నీటి కంటే, లభ్యతలో ఉన్న నీటిని ఎక్కువగా తోడుతున్నారని కేంద్రానికి కేంద్ర భూగర్భ జల శాఖ నివేదిక అందించింది. భూగర్భ జల పరిక్షణ జోన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని నిమిత్తం కేంద్ర, రాష్ట్ర భూగర్భ జల శాఖలు మ్యాపింగ్‌ను ఖరారు చేయనున్నాయి. పట్టణాల్లో వార్డ్ భూగర్భ జల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల పనితీరును మున్సిపల్ వాటర్ మేనేజిమెంట్ కమిటీలు పర్యవేక్షిస్తాయి.