జాతీయ వార్తలు

సంకీర్ణాలతో ఉనికికే చేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకీర్ణాలకు ఒడిగట్టడం అసలు గుర్తింపునకే ముసురు తెస్తుందని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. కేంద్రంలో బిజెపిని ఓడించేందుకు వివిధ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతగా ప్రణబ్ చేసిన సూచన మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇతర పార్టీలతో కూటములు గట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఉనికి మరింత నీరుగారిపోతుందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. 1996-2012 మధ్యకాలంలో సాగిన సంకీర్ణ ప్రభుత్వాలపై రాసిన ఓ పుస్తకంలో ప్రణబ్ అనేక అంశాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సంకీర్ణ ప్రభుత్వాలపై తన ఆలోచన మారలేదన్నారు. 2004 ఎన్నికలకు ముందు బిజెపిని ఓడించేందుకు వివిధ పార్టీలతో చేతులు కలపాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలతో తాను ఏకీభవించలేదన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేయడమే సరైన మార్గమని, దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పదిలపరచుకోగలుగుతుందని ఉద్ఘాటించారు. బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక వాద పార్టీలతో చేతులు కలపాలంటూ 2003లో సిమ్లాలో జరిగిన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన ప్రణబ్ ‘అది అంతకుముందు జరిగిన పంచమడి తీర్మానానికి విరుద్ధం. తప్పనిసరి పరిస్థితుల్లోనే సంకీర్ణ కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆ సదస్సులో మేము తీర్మానించాం’అని గుర్తు చేశారు. సిమ్లా సదస్సులో అందరి అభిప్రాయాలను సేకరించారని, పంచమడి తీర్మానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని సోనియా, మన్మోహన్ సహా అందరూ మొగ్గు చూపారని ప్రణబ్ తెలిపారు. కానీ తానొక్కడినే అందుకు భిన్నంగా మాట్లాడానని, ఇతర పార్టీలతో చేతులు కలపడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని విస్పష్టంగా తెలియజేశానన్నారు. ప్రత్యేకంగా 2004 సంవత్సరానికి సంబంధించి ఈ పుస్తకంలో అనేక ఆసక్తిరమైన అంశాల్ని ముఖర్జీ ప్రస్తావించారు. ‘ఇది ఇందిరా ఇయర్స్’, ది టర్బ్యులెంట్ ఇయర్స్’ పేరుతో ఇప్పటివరకూ ప్రణబ్ రెండు పుస్తకాలు వెలువరించారు. సంకీర్ణ శకానికి సంబంధించిన అంశాలపై తన మూడో పుస్తకాన్ని వెలువరించారు. అధికార పీఠాన్ని ఎక్కాలన్న పట్టుదలకు పోయి కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోకూడదన్నది తన నిశ్చితాభిప్రాయమని పేర్కొన్న ప్రణబ్ ‘ప్రతిపక్షంలో కూర్చున్నా తప్పులేదు కానీ.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ తన ఉనికిని మాత్రం కోల్పోకూడదు’ అని ఉద్ఘాటించారు.