జాతీయ వార్తలు

అలహాబాద్ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎబివిపి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపికి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎబివిపి తాజాగా అలహాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అక్కడ సమాజ్‌వాది పార్టీకి చెందిన విద్యార్థి సంఘం సమాజ్‌వాది చత్రసభ (ఎస్‌సిఎస్) గెలుపొందడం విశేషం. 2015లో మొత్తం పదవులను కైవసం చేసుకున్న ఎబివిపి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక జనరల్ సెక్రటరీ పదవిని మాత్రమే దక్కించుకోగా, ఎస్‌సిఎస్ మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులను సైతం గెలుపొందింది.