జాతీయ వార్తలు

గ్యాంగ్‌రేప్ బాధితురాలి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాఘ్‌పట్, అక్టోబర్ 15: ఉత్తరప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం అయిదుగురి చేతిలో సామూహిక అత్యాచారానికి గురయిన 15 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అఘాయిత్యానికి పాల్పడిన ఆ అయిదుగురు నెల రోజుల క్రితం బాధితురాలిని మళ్లీ రేప్ చేస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు. తొలుత ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత ఆ అయిదుగురు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నాలుగు నెలల క్రితం బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి, నిందితులు అయిదుగురిని అరెస్టు చేశారు. అయితే వారి కుటుంబాల నుంచి వచ్చిన ఒత్తిడితో తరువాత వారిని వదలిపెట్టారని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శరద్ తిలారాను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించామని పోలీసు సూపరింటెండెంట్ ఆదివారం తెలిపారు. నిందితులయిన సోను, మోను, రోహిత్, సాగర్, పప్పులను తిరిగి అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, సుమారు నాలుగు నెలల క్రితం అయిదుగురు వ్యక్తులు ఆ బాలికను అపహరించుకు పోయారు. అయిదు రోజుల తరువాత బాధితురాలు రమాలా పోలీసు స్టేషన్ వెలుపల అపస్మారక స్థితిలో పడి ఉంది. స్పృహలోకి వచ్చిన తరువాత ఆ బాలిక తనను అయిదుగురు వ్యక్తులు అపహరించుకు వెళ్లారని, ఒక గదిలో ఉంచి గ్యాంగ్ రేప్ చేశారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అదే అయిదుగురు వ్యక్తులు తిరిగి రేప్ చేస్తామని సెప్టెంబర్ 13న బాధితురాలిని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. అయితే తల్లిదండ్రులు తమను ఆశ్రయించక ముందే బాధితురాలు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అయిదుగురు నిందితులను ఎందుకు వదలివేశారనే అంశంపై కూడా దర్యాప్తు జరుపుతామని ఎస్‌పి తెలిపారు.