జాతీయ వార్తలు

యువతకు స్ఫూర్తి, దీప్తి కలాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఓ శాస్తవ్రేత్తగా, మేధావిగా, భారత రాష్టప్రతిగా ఎ.పి.జె. అబ్దుల్ కలాం దేశానికి వివిధ హోదాల్లో చేసిన సేవలు నిరుపమానమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శ్లాఘించారు. భారతదేశ క్షిపణి టెక్నాలజీకి ఆద్యుడైన కలాం దేశ యువతకు తిరుగులేని స్ఫూర్తినిచ్చారని- తన మాటలతో, చేతలతో దేశ హితం దిశగా వారిని కార్యోన్ముఖం చేయగలిగారని అన్నారు. రామేశ్వరం నుంచి వచ్చిన పిల్లల బృందంతో మాట్లాడిన కోవింద్ భారతదేశ మిసైల్ మ్యాన్‌గా కలాం తిరుగులేని సేవలందించారని, ఆయన విజయాలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను ఎంతగా చదివితే అంతగా దేశ యువత వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని, నవభారత నిర్మాణం దిశగా వారు అంకితభావంతో పనిచేయగలుగుతారని కోవింద్ అన్నారు. ప్రజల రాష్టప్రతిగా, దేశానికి క్షిపణి టెక్నాలజీని అందించిన మహా మేధావిగా, శాస్తవ్రేత్తగా కలాం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, అణు టెక్నాలజీనుంచి అతితక్కువ ధరకు హృద్రోగులకు స్టెంట్‌లను అందుబాటులోకి తెచ్చేవరకు కలాం భిన్న రంగాల్లో నిరుపమాన సేవలందించారని కోవింద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన సేవలను భారత ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని పేర్కొన్న కోవింద్ భారతదేశంలో విద్యాప్రమాణాలను ఇనుమడింపజేయడానికి, అలాగే బోధనా విధానాన్ని మరింత పరిపుష్టం చేయడానికి కలాం ఎంతగానో తపించేవారని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా సరికొత్త ఆలోచనలను పాదుకొల్పే దిశగా యువతను ముందుకు నడిపించడానికే కలాం పాటుపడేవారని చెప్పారు. తాను దేశానికి రాష్టప్రతి అయినా కూడా, ఓ పెద్ద శాస్తవ్రేత్త అయినా కూడా ఇటు ప్రజలతోనూ అటు యువతతోనూ విద్యార్థులతోనూ గడిపేందుకే కలాం ఎంతో ఇష్టపడేవారని, అందుకే దేశ ప్రజలు, యువతకు ఆయన ఆరాధనీయమయ్యారని తెలిపారు. విద్యార్థులను ఎంతగానో ప్రేమించిన కలాం తన చివరి క్షణాలను వారితోనే గడపటం దేశ యువత ఆలోచనలను సరికొత్త రీతిలో పదును పెట్టడం ఆయన తపనకు నిదర్శనమని అన్నారు. ‘కలాం స్వదేశ్ వాహిని, విజన్ 2020’ బస్సులోనే ఈ విద్యార్థులు రామేశ్వరం నుంచి రావడాన్ని ప్రస్తుతించిన కోవింద్ ఈ బస్సు మాజీ రాష్టప్రతి జీవితాన్ని భిన్న కోణాల్లో ఆవిష్కరించిందన్నారు. విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రశంసించిన ఆయన ఇది కచ్చితంగా లక్షలాదిమంది భారతీయులకు ప్రేరణ అవుతుందని, ఓ రకంగా ఇది కలాం రాసిన పుస్తకాలు ఆయన దార్శనికతకు ఓ మొబైల్ ఎగ్జిబిషన్ లాంటిదేనని అన్నారు.

చిత్రం..మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆదివారం రాష్టప్రతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పిస్తున్న రామ్‌నాథ్ కోవింద్