జాతీయ వార్తలు

దాస్నా ఖైదీలకు దంత వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాస్నా, అక్టోబర్ 15: ఆరుషి హత్యకేసులో ఏళ్ల తరబడి జైలుశిక్ష అనుభవించి నిర్దోషులుగా విడుదలైన ఆమె తల్లిదండ్రులు ప్రోత్సాహక రీతిలో ఖైదీలకు సేవలందించడానికి సిద్ధమవుతున్నారు. వృత్తిరీత్యా దంత వైద్యులైన రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్ తాము జైలుశిక్ష అనుభవించిన దాస్నా జైలుకు వెళ్లి ప్రతి పదిహేను రోజులకోసారి ఖైదీల దంత వైద్యం చేసేందుకు ముందుకొస్తున్నారు. దాస్నా జైల్లో గడిపిన వీరు అక్కడ ఖైదీలు అనుభవిస్తున్న దంత సమస్యలను తెలుసుకున్నారని, ఇప్పుడు జైలునుంచి విడుదల కావడంతో ప్రతి 15 రోజులకోసారి ఈ జైలును సందర్శించి ఖైదీలకు చికిత్స చేయాలనుకుంటున్నారని అధికారులు తెలిపారు.