జాతీయ వార్తలు

దేశ రాజధానిలో అలరించిన నాటికల పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశ రాజధానిలో ఢిల్లీ తెలుగు అకాడమీ, శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ నేతృత్వంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన నాటికల పోటీలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాయి. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో అక్టోబర్ 13న ప్రారంభమైన పోటీలు సోమవారంతో ముగిశాయి. విభిన్న ఇతివృత్తాలతో ఆరు నాటికలు, రెండు ప్రత్యేక ప్రదర్శనలతో ఢిల్లీ తెలుగు కళాప్రియులను అలరించాయి. మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శన ‘‘మధురం’’ నాటికతో ప్రారంభమయ్యాయి. పివి భవాని ప్రసాద్ రచించిన ఈ నాటికను గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగాశ్రీ సాయి ఆర్ట్స్, కొలుకలూరు వారు ప్రదర్శించారు. ఢిల్లీకి చెందిన లలిత కళావాహిని వారు ప్రదర్శించిన ‘సారీ రాంగ్ నెంబర్’ నాటిక హాస్యంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ నాటికను ఎస్‌ఎ.రావు రచించగా మున్నంగి కుసుమ దర్శకత్వం వహించారు. అలాగే లఖిత సాయి క్రియేషన్స అనకాపల్లి వారు ప్రదర్శించిన ‘పంపకాలు’ నాటిక కుటుంబాల మధ్య ఉండే ప్రేమానురాగాలతో అలరించాయి.