జాతీయ వార్తలు

జిల్లాకో ఆయుష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జాతి చరిత్ర, వారసత్వానికి విలువనివ్వకుంటే దేశాభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ స్థాపించిన అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ధన్వంతరి జయంతిని ఆయుర్వేద దినంగా నిర్వహించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొగల్ చక్రవర్తి నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ మన చరిత్ర, సంసృతికి చిహ్నం కాదంటూ బిజెపి యూపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరుణంలో, జాతి చరిత్ర, వారసత్వాన్ని గౌరవించాలని మోదీ పిలుపునివ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు మన విజ్ఞానం, యోగ, ఆయుర్వేదం తదితర వ్యవస్థలను చిన్నచూపు చూసేవారని వాపోయారు. యోగ, ఆయుర్వేదంపై మనకున్న విశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నాలూ జరిగాయని నరేంద్ర మోదీ చెప్పారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గత మూడేళ్లలో ఈ పరిస్థితిని పూర్తిగా మర్చామని, యోగాపట్ల ప్రపంచానికి విశ్వాసం కలిగించగలిగామని అన్నారు. ఆయుర్వేద దినోత్సవం, యోగ దినోత్సవాలకు హాజరవుతున్న ప్రజల సంఖ్య చూస్తుంటే, విశ్వాసం పెరుగుతోందన్న విషయం స్పష్టమవుతోందని ప్రధాని అన్నారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాదు, ఇందులో ప్రజారోగ్యం, పర్యావరణ ఆరోగ్యం ఇమిడి ఉన్నాయని నరేంద్ర మోదీ వివరించారు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం యోగ, ఆయుర్వేదం, ఇతర ఆయుష్ విధానాలను ప్రజారోగ్య వ్యవస్థతో జత చేస్తోందని వివరించారు. దేశంలోని ప్రతి జిల్లాలో
ఒక ఆయుర్వేద ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని, గత మూడేళ్లలో 65 ఆయుర్వేద ఆసుపత్రులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మూలికలు, ఔషధ మొక్కల పెంపకం మంచి ఆదాయ మార్గమని మోదీ సూచించారు. మూలిక, ఔషధ మొక్కల విషయంలో మనకున్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరేంద్ర మోదీ హితవు పలికారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో నూటికి నూరుశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించామని మోదీ తెలిపారు. పేద ప్రజలకు చౌక వైద్య, ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రోగాలను అరికట్టటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రత తొలిమెట్టని ఉద్భోదించారు. పరిశుభ్రత సాధనలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్లలో దాదాపు ఐదు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించిదని మోదీ వివరించారు.

చిత్రం..ఢిల్లీలో నిర్వహించిన ఆయుర్వేద సదస్సులో నరేంద్ర మోదీ