జాతీయ వార్తలు

దళితులకు ఆర్థిక దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు బడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం ప్రభుత్వం త్వరలోనే స్టాండప్ ఇండియా అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు, మహిళలు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, బడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం స్టాండప్ ఇండియా పథకం కింద త్వరలోనే ప్రతి బ్యాంకు శాఖ ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారికి ఒకరికి, ఒక మహిళకు కోటి రూపాయల దాకా రుణం అందజేస్తుందని జైట్లీ చెప్పారు. శనివారం బిజెపి ఢిల్లీ విభాగం కార్యకవర్గ సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ ఈ విషయం చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు మరింత చేరువ కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బిజెపి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు సైతం దూరమైన ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు లాంటి వర్గాలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని జైట్లీ అన్నారు. ముద్రా బ్యాంక్, జన్‌ధన్ యోజన లాంటి సామాజిక భద్రతా పథకాల ద్వారా లబ్ధి పొందిన వేలాది మందిని ఒక్క చోటికి తీసుకు వచ్చి, వారిలో తమ పునాదులను బలోపేతం చేసుకోవలసిన బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని జైట్లీ చెప్పారు.