జాతీయ వార్తలు

శివాలయం కూల్చేసి తాజ్‌మహల్ కట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 18: తాజ్‌మహల్ నిర్మాణంపై బిజెపి నేతలు రోజుకో ప్రకటన చేస్తూ వివాదాన్ని రాజేస్తున్నారు. రెండ్రోజుల క్రితం బిజెపి ఎంపీ సంగీత్ సోమ్ మొఘల్ రాజులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరిచిపోకముందే అదే పార్టీ సీనియర్ ఎంపీ వినయ్‌కతియార్ బుధవారం అలాంటి ప్రకటనే చేశారు. ఆగ్రాలో శివాలయాన్ని కూల్చేసి మొఘల్ చక్రవర్తిషాజహాన్ తాజ్‌మహల్ నిర్మించాడని కతియార్ విమర్శించారు. తాజ్‌మహల్ ఇన్నచోట ‘తేజోమహల్’ ఉండేదని దాన్ని కూల్చివేసి తాజ్‌మహల్‌ను కట్టేశారని ఆయన అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్‌మహల్‌ను పడగొట్టాలని తాను కోరడం లేదన్న ఎంపీ‘వాస్తవ పరిస్థితులపైనే నేను మాట్లాడుతున్నాను‘అని స్పష్టం చేశారు. టూరిజం పథకాల సమీక్ష కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వినయ్ కతియార్ పేర్కొన్నారు.‘అక్కడ తేజోమహల్ ఉండేది. శివాలయం ఉండేది. షాజహాన్ భార్య చనిపోతే అక్కడే ఖననం చేసి తాజ్‌మహల్ నిర్మించాడు’అని బిజెపి ఎంపీ తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని ఆయన సష్టం చేశారు. తాజ్‌మహల్ నిర్మాణం ఆకృతులు హిందూ కళలనే పోలి ఉంటాయని ప్రముఖ చరిత్రకారుడు పిఎన్ ఓక్ చెప్పారని ఎంపీ గుర్తుచేశారు. అయోధ్యలో దీపావళి ఘనంగా జరపాలన్న సిఎం పిలుపును రాజకీయ కోణంలో చూడడం సరైందికాదన్నారు. బాబ్రీ కేసు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమై రామమందిరం నిర్మించాలన్న ఆకాంక్షను కతియార్ వ్యక్తం చేశారు. అయోధ్యను అభివృద్ధి చేసిన అక్కడ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పనిచేస్తోందని, దాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితమని ఎంపీ తెలిపారు.