జాతీయ వార్తలు

మీ ప్రమేయంతోనే రాజకీయ హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 18: కేరళలో రాజకీయ వేడి కొనసాగుతునే ఉంది. అధికార సిపిఎం, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తమ పార్టీ కార్యకర్తల మృతికి కారణం మీరేనంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నాయని సిపిఎం కార్యదర్శి కొడియెరి బాలకృష్ణన్ ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడి వెనక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఉందని ఆయన ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్,బిజెపి కార్యకర్తల హత్యల వెనక ముఖ్యమంత్రి పి విజయన్ హస్తం ఉందని బిజెపి చీఫ్ అమిత్‌షా ఆరోపించిన నేపథ్యంలో సిపిఎం కూడా షాపై ఎదురుదాడి చేసింది.‘అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్ మా కార్యకర్తల హత్యలకు బాధ్యత వహించాలి. తక్షణం బిజెపి స్పందించాలి’అని బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. బిజెపి జనరక్ష యాత్ర ముగింపుపేలవంగా సాగిందని ఆయన అన్నారు. 1970 తరువాత రాష్ట్రంలో రాజకీయ హింస పెచ్చరిల్లడానికి ఆర్‌ఎస్‌ఎస్ కారణమని సిపిఎం నేత విమర్శించారు. 214 మంది సిపిఎం కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఇవన్నీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రోద్భలంతో జరిగినవేనని బాలకృష్ణన్ చెప్పారు. కేరళలో అశాంతిని సృష్టించడానికి అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని సిపిఎం ఆరోపించింది. ‘కన్నూర్‌లోని పొయ్యానూర్ బిజెపి జనరక్ష యాత్ర ప్రారంభానికి సింహలా వచ్చాని షా చెప్పుకున్నారు. ఆఖర్న ముగింపునాడు ఎలుక మాదిరి తోకజాడించారు’ అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అందులో బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో సుపరిపాలన సాగుతోందని సిపిఎం నేత స్పష్టం చేశారు. బిజెపి తప్పుడు విధానాలు, ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈనెల 21 నుంచి జన జాగారణ్ యాత్రలు 140 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు బాలకృష్ణన్ వెల్లడించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు.