జాతీయ వార్తలు

బిజెపి జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలుండగా ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. హిమాచల్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ధుమాల్‌కు సుజన్‌పూర్ శాసనసభ స్థానాన్ని కేటాయించారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన సుఖ్‌రాం కుమారుడు అనిల్ శర్మకు కూడా సీటు కేటాయించారు. కేంద్ర మంత్రి జెపి నడ్డాను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరు భావించిన నేపథ్యంలో ఈ జాబితాలో ఆయన పేరును ప్రకటించకపోవడం విశేషం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించడంతోపాటు అభ్యర్థుల బాధ్యతను కూడా ఆయనకే అప్పగించింది. వీరభద్ర సింగ్ ఆర్‌కే శాసనసభ నియోజకవర్గం నుంచి, సిమ్లా నుంచి ఆయన కుమారుడు విక్రమాదిత్య పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పాకులాడుతుంటే, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో అంతర్గత కలహాల మూలంగా అధికారం దక్కలేదని, ఈ ఎన్నికల్లో మాత్రం గెలుపు తమదేనని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది.

హెర్ష్‌మన్ వ్యాఖ్యలను శోధిస్తాం

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి తాము చేపట్టిన దర్యాప్తును అప్పటి రాజీవ్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందంటూ ఓ ప్రైవేటు డిటెక్టివ్ మైఖేల్ హెర్ష్‌మన్ చేసిన ఆరోపణపై దర్యాప్తు జరుపుతామని వాస్తవాలను, అప్పటి పరిస్థితులను వెలుగులోకి తెస్తామని సిబిఐ బుధవారం స్పష్టం చేసింది. అప్పట్లో అమెరికాకు చెందిన డిటెక్టివ్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ అధ్యక్షుడుగా పనిచేసిన హెర్ష్‌మన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మోంట్‌బ్లాంక్ పేరుతో ఉన్న స్విస్‌బ్యాంక్ ఖాతా గురించి తాను వెల్లడించిన అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహించారని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బోఫోర్స్ శతఘు్నల కుంభకోణంలో చోటుచేసుకున్న ముడుపుల సొత్తు అంతా స్విస్ ఖాతాల్లోనే జమ అయిందని కూడా ఆయన వెల్లడించారు. 24 కోట్ల బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి జరిగే దర్యాప్తులో తాను అవసరమైన సమాచారాన్ని ఇస్తానని కూడా తెలిపారు. అయితే ఈ దర్యాప్తు అన్నది నిజాయితీగా, విశ్వసనీయ రీతిలో జరగాలని పేర్కొన్నారు. హెర్ష్‌మన్ చేసిన వ్యాఖ్యల గురించి టీవీ చానళ్ల ద్వారానే తాము విన్నామని, అందులో నిజానిజాలేమిటో తేల్చడానికి లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటున్నామని సిబిఐ సమాచార అధికారి, ప్రతినిధి అభిషేక్ దయాళ్ ఒక ప్రకటనలో తెలిపారు. హెర్ష్‌మన్ ప్రకటనలో పేర్కొన్న అంశాల వెనుకనున్న నిజానిజాలను తగిన ప్రక్రియద్వారానే నిగ్గు తేలుస్తామన్నారు.