జాతీయ వార్తలు

పనిలో.. సృజనాత్మకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: నవ భారత నిర్మాణానికి అధికారులు ఒక పరిధికే పరిమితం కాకుండా సృజనాత్మకతతో పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. 2022 సంవత్సరం నాటికి నవ భారతాన్ని నిర్మించాలంటే అధికారులు చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని ప్రధాన మంత్రి సీనియర్ అధికారులకు ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలలో పనిచేస్తున్న 380 మంది డైరక్టర్లు, ఉపకార్యదర్శులను నాలుగు గ్రూపుగా విభజించి ప్రధాన మంత్రితో సమావేశపరిచారు. నరేంద్ర మోదీ ఒక్కొక్క గ్రూపుతో దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఆఖరు గ్రూపు సమావేశం అక్టోబర్ 17న జరిగింది. సుపరిపాలన, అవినీతి, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, రవాణా, జాతీయ సమైక్యత, జల వనరులు, స్వచ్చ్భారత్, సంస్కృతి, కమ్యూనికేషన్, పర్యటన తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరిగాయి. నవ భారత నిర్మాణానికి అధికారులు అంకితభావంతో పని చేయాలని, గిరిగీసుకుని ఒక పరిధికే పరిమితం కావటం వలన నవ భారతాన్ని నిర్మించలేమని ప్రధాని స్పష్టం చేశారు. అధికారులు ముందుచూపుతో వ్యవహరించటం ద్వారా లక్ష్యాలను సాధించాలని ఆయన హితవు చెప్పారు. పరిపాలన వేగవంతంగా ముందుకు సాగాలంటే అధికారులు కొత్త పద్ధతుల్లో ఆలోచించాలి, తద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. అధికారులు సృజనాత్మకతతో పనిచేస్తేనే పరిపాలనకు సంబంధించిన వివిధ ప్రక్రియలు వేగం పుంజుకుంటాయని నరేంద్ర మోదీ సూచించారు. మంచి ఫలితాలను సాధించేందుకు డైరెక్టర్లు, ఉప కార్యదర్శి స్థాయి అధికారులు తమ బృందాలను సృష్టించుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో ప్రధాన మంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, సీనియర్ అధికారులు, క్యాబినెట్ కార్యదర్శి కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.