జాతీయ వార్తలు

1400కు మించకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18:రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వివిపిఎటి పద్ధతిలో నిర్వహించనున్న దృష్ట్యా ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1400 మంది కి మించి ఓటర్లు ఉండటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పేపర్‌ట్రయల్ మిషన్‌కు అమర్చే పేపర్ రోల్ కేవలం 1500 స్లిప్‌లను మాత్రమే ముద్రించగలుగుతుందని..ఓటింగ్ మధ్యలో కొత్త పేపర్ రోల్‌ను అమర్చడం సాధ్యం కాదుకాబట్టి ఓ పోలింగ్ కేంద్రంలో ఓటువేసే ఓటర్ల సంఖ్య 1400మించకూడదని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. విపిపిఎటి యంత్రాలకు అమర్చే పేపర్‌రోల్ కేవలం 1500 స్లిప్‌లను మాత్రమే ఇవ్వ గలుగుతుందని పేర్కొన్న ఎన్నికల కమిషన్ ‘పేపర్ ట్రయల్ యంత్రాన్ని పరీక్షించడానికి..నమూనా పోలింగ్ నిర్వహించడానికి 100 స్లిప్‌లు ముద్రితం అవుతాయి’అని తెలిపింది. దీని దృష్ట్యా ఇక ఆ రోల్‌లో మిగిలేది 1400 స్లిక్‌లే కాబట్టి అంతకు మించిన సంఖ్యలో ఓటర్లు ఏ పోలింగ్ కేంద్రంలోనూ ఉండటానికి వీల్లేదని తెలిపింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతోనే నిర్వహిస్తామని, ఇంతకు ముందు గోవాలో కూడా వంద శాతం వివిపిఎటి పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపింది. వివిపిఎటితో పాటు ఇవిఎమ్‌లను కూడా అన్ని నియోజక వర్గాల్లో నూ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.