జాతీయ వార్తలు

ఆకాశమే హద్దుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్-రష్యాల మధ్య ‘ఇంద్ర 2017’ పేరుతో శనివారం నుంచి ప్రారంభకానున్న పది రోజుల సైనిక విన్యాసాలు చైనాను కలవరపెడుతున్నాయి. భారత్-రష్యాల మధ్య స్నేహానికి సంకేతంగా జరుగుతున్న ఈ విన్యాసాలపై అలాగే అందుకు సంబంధించిన పరిణామాలపై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. రష్యాతో అన్ని వేళలా మరింత బలమైన, స్థిరమైన సంబంధాలను అలాగే రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే భారత్ ఈ సైనిక విన్యాసాలు సిద్ధమైందని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఓ పక్క అమెరికాతోనూ జపాన్‌తోనూ రాజకీయ, ఆర్థిక, రక్షణ సంబంధాలను పెంపొందించుకుంటునే రష్యాతోకూడా అదేస్థాయి సాన్నిహిత్యాన్ని విస్తృతం చేసుకోవాలన్నదే భారత్ ఆశయంగా కనిపిస్తోందని, అందుకు ఈ సంయుక్త విన్యాసాలే నిదర్శనమని చైనా పత్రికి స్పష్టం చేసింది.
తొలిసారిగా రష్యాలోని వ్లాడిఓ స్టోక్‌లో జరుగుతున్న ఈ విన్యాసాలు భారత త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. పదాతి, వైమానిక, నౌకదళాలకు చెందిన 400 మంది ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సత్‌పురా, ఐఎన్‌ఎస్ కద్‌మత్‌లు వ్లాడిఓ తీరానికి చేరుకున్నాయి. అలాగే ఈ విన్యాసాల్లో రష్యాకు చెందిన 1000 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇరుదేశాల త్రివిధ దళాల మధ్య మరింత సాన్నిహిత్యాన్ని, సమన్వయాన్ని సహకారాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఐరాసలో ఒప్పందలో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలను ఉమ్మడి శక్తితో అణచివేయాలన్నది కూడా ఈ విన్యాసాల లక్ష్యంగా చెబుతున్నారు. వీటి ఆశయం ఇలా ఉంటే భారత్‌లో చీకిటీ మాటికి కయ్యానికి కాలుదువ్వే చైనా మాత్రం మరొక రకమైన కథనాలు వినిపిస్తోంది. రష్యాతో రక్షణ బంధాన్ని పెంచుకోవడంతో పాటు తన ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికే భారత్ ప్రయత్నిస్తోందని చైనా పత్రిక విశే్లషిస్తోంది. ఓపక్క అమెరికా- రష్యా మధ్య వ్యూహాత్మక పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ మరింతగా అమెరికాకు చేరువైందని దానిపట్ల రష్యాకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఆ దేశంతో కూడా సరికొత్త సాన్నిహిత్యానికి ప్రయత్నిస్తోందని చైనా పత్రిక పేర్కొంది. ఇతర దేశాలతో తమ మైత్రి బంధం ఎలా ఉన్నా రష్యా తమకు ఇప్పటికీ అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామ్య దేశమని ఈ చర్య ద్వారా భారత్ స్పష్టం చేస్తోందని తెలిపింది. అయితే చైనాతో సరైన సంబంధాలు లేకుండా సహకరించకుండా భారత్ ఏ విధంగానూ తన ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం లేదని గ్లోబల్ టైమ్స్ హెచ్చరిక స్వరాన్ని వినిపించింది. చైనా పత్రిక కథనాన్ని బట్టి చూస్తే భారత్-రష్యా సైనిక విన్యాసాలు ఆ దేశ నాయకత్వంలో గుబులు రేపుతున్న విషయం కళ్లకు కడుతోంది.