జాతీయ వార్తలు

ఎక్స్‌గ్రేషియా రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 21: విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు అందజేసే ఎక్స్‌గ్రేషియాను రెట్టింపు చేస్తున్నట్లు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. గతంలో ఈ మొత్తం 25 లక్షలు మాత్రమే ఉండేది. మృతుని కుటుంబానికిచ్చే 20 లక్షలను 40 లక్షలకు పెంచడంతోపాటు అతని తల్లిదండ్రులకు ఇచ్చే ఐదు లక్షలను పది లక్షలకు పెంచుతున్నట్లు ఆదిత్యనాథ్ వివరించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారంనాడు ఇక్కడి పోలీసు లైన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నేర-రహిత, అవినీతి-రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పెంపొందించేందుకు కృషి జరుగుతోందని అన్నారు. శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడడంతో పోలీసుల కృషి అమోఘమని శ్లాఘించారు. రాష్టంలో ప్రముఖంగా నిర్వహించే ఈద్-ఉల్-్ఫతర్, బక్రీద్, మొహర్రం, దుర్గాపూజ, దసరా తదితర పర్వదినాల్లో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. మహిళల రక్షణకోసం యాంటీ-రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతిరోజూ 60 నిమిషాలపాటు కాలినడకన పట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే పోలీసులకిచ్చే పౌష్టిక ఆహార బత్తాను కూడా పెంచుతున్నట్లు తెలిపారు.

చిత్రం..పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులను గౌరవిస్తున్న యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్