జాతీయ వార్తలు

రేవంత్ రాకను అడ్డుకోవద్దు: విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించరాదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు సొంత పార్టీ నేతలను కోరారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ సర్దుకుని పోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో టిడిపి లేదు కాబట్టి తమ పార్టీలో చేరాల్సిందిగా తాను రేవంత్‌ను కోరుతున్నానని చెప్పారు. జిఎస్‌టితో చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కాడని విమర్శించారు. బోఫోర్సు కేసును మళ్లీ వెలికి తీయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. బోఫోర్సు కేసులో రాజీవ్ గాంధీకి సంబంధం లేదని 2005లోనే కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.