జాతీయ వార్తలు

ట్రక్కు బోల్తా.. 10మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: మహారాష్టల్రోని సంగ్లీ జిల్లాలో ట్రక్కు బోల్తాపడిన సంఘటనలో పది మంది మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో కొంతమంది కూలీలు రాతి స్లాబ్‌ల లోడ్‌తో వెళుతున్న ట్రక్‌పై ప్రయాణిస్తున్నారని, అందుకే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక వివరణ వెలువడలేదు.
మృతిచెందినవారంతా మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది. ట్రక్కు కర్నాటక నుంచి మహారాష్టల్రోని కరద్‌కు వెళ్తుండగా మానేరాజూరి గ్రామంవద్ద ప్రమాదానికి గురైంది. ట్రక్కు మలుపు తిప్పే సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని సంగ్లీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. పది మృతదేహాలు, 13 మంది గాయపడిన వారు తమ ఆసుపత్రికి వచ్చినట్లు డీన్ డాక్టర్ పల్లవి సప్లే విలేఖరులకు తెలిపారు. మరో 13 మంది ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు డీన్ తెలిపారు.

చిత్రం..మహారాష్టల్రోని సంగ్లీ జిల్లాలో బోల్తాపడిన ట్రక్కు