జాతీయ వార్తలు

మార్గదర్శకాలు రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: థియేటర్లలో సినిమా ప్రదర్శన ముందు జాతీయ గీతాన్ని కచ్చితంగా ఆలపించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు సవరించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో జాతీయ గీతం జనగణమణ ఆలపించే విధానాన్ని క్రమబద్ధం చేసేలా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జాతీయగీతాలాపన సందర్భంగాలో ప్రజలు నిలబడి, గౌరవం పాటించాలన్న అంశంపైనే ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దేశ భక్తిని కోర్టు బలవంతగా రుద్దకూడదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు సవరించబోమని పేర్కొంది. 2016 నవంబర్ 30న అన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన ముందు జాతీయగీతాలాపనను కచ్చితం చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. జనగణమన ఆలపించే సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. అయితే శారీరక వైకల్యం గలవారి విషయంలో వెసులుబాటు కల్పిస్తూ తరువాత వివరణ ఇచ్చింది. కాగా జాతీయ గీతాలాపన విషయంలో దేశవ్యాప్తంగా అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. లేచి నిలబడని ప్రేక్షకులపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం, ఉద్రిక్తతలు తలెత్తడం జరిగింది.