జాతీయ వార్తలు

గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 22: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూలును విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్‌లో విడుదల చేయకపోవడాన్ని తమిళనాడులోని డిఎంకె పార్టీ తప్పుబట్టింది. ఇటీవల అదే అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కురిపించిన విమర్శలతో డిఎంకె గొంతు కలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈ నెల 12న ఇసి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గుజరాత్‌లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడేనని విపక్షాలు విమర్శలకు తెరతీశాయి. గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలను హడావిడిగా ప్రారంభిస్తున్నారని, అందుకు అవకాశం కల్పించేందుకే ఇసి ఎన్నికల షెడ్యూలును విడుదల చేయలేదని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో తాజాగా డిఎంకె వర్కిండ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ గొంతుకలిపారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీ పర్యటనలు సాజావుగా సాగేందుకే అక్కడ ఎన్నికల షెడ్యూలు ప్రకటించలేదని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం తీవ్రంగా విమర్శించారు.
ఇలావుండగా తమిళనాడు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఉన్నంతకాలం ఎఐడిఎంకెను ఏ శక్తీ అడ్డుకోలేదని చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ ప్రస్తావిస్తూ, పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వంపై కేంద్రం వత్తిళ్లు ఉన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. అందుకే రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని తాము చేసిన డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వం దుమ్మెత్తిపోశారు. రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని, జిఎస్‌టి నుంచి వ్యాపారులకు రక్షణ కల్పించలేకపోతున్నారని, కావేరీ నీటిని సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

చిత్రం..చెన్నైలోని ఓ పాఠశాలలో నిర్వహిస్తున్న డెంగ్యూ వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్