జాతీయ వార్తలు

కాంగ్రెస్‌తో కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: అధికారంలోని బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు సిపిఎం సమాలోచనలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలన్న ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదనను మెజారిటీ సభ్యులు స్వాగతించినట్టు తెలిసింది. అయితే ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ కారత్ మాత్రం ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించారు. మూడేళ్ల క్రితం విశాఖపట్నంలో జరిగిన సిపిఎం మహాసభల్లో కాంగ్రెస్ పార్టీలాంటి బూర్జువా పార్టీలతో కాకుండా వామపక్ష కూటమితోనే కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని రాజకీయ తీర్మానం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగల్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సిపిఎం తీవ్రంగా నష్టపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్‌తో సిపిఎం మధ్య నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌తో కలిసి పని చేయకూడదని, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేయాలని ప్రకాష్ కారత్ కేంద్ర కమిటీ సమావేశాల్లో స్పష్టం చేయడంతోపాటు సీతారాం ఏచూరి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని బిజెపిలాంటి మతతత్వ పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తో కలిసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడంతోపాటుగా, రాజకీయంగా కూడా కలిసి పనిచేద్దామని సీతారాం ఏచూరి చేసిన ప్రాతిపాదనకు పార్టీలోని మెజారిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి పనిచేయాడానికి సిద్ధంగా ఉన్నట్టు సిపిఎం సంకేతాలిచ్చింది. అలాగే కేంద్ర కమిటీ సమావేశాల్లో సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాజకీయ నిర్ణయంద్వారా వివిధ రాష్ట్రాల్లో సిపిఎం, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటికి సిద్ధం కానున్నట్టు సిపిఎం వర్గాలు సంకేతాలిస్తున్నాయి.

చిత్రం..సీతారాం ఏచూరి