జాతీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిజస్వరూపాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని బిజెపి నేతలు చేస్తున్న వ్యంగ్యోక్తులు, విమర్శలు ఇంక ఎంతోకాలం సాగవని శనివారం ఇక్కడ అన్నారు. బిజెపిను ఢీకొట్టగల సమర్థుడైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎదిగారని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏమిటో, బిజెపి ప్రభుత్వం ఏమిటో ప్రజలకు అర్థమవుతోందని, వారిపై ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని శశిథరూర్ వెల్లడించారు. బిజెపికి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఎంపీ తెలిపారు. మోదీ ప్రభుత్వంపై ఉన్న అనుమానాలు, విధానాలపై ప్రజలు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని తిరువనంతపురం ఎంపీ స్పష్టం చేశారు. ‘రాహుల్ గాంధీని విమర్శించండంలో బిజెపి ప్రభుత్వం విజయవంతమైంది. అది ఇప్పటివరకూ జరిగింది. ఇకముందు బిజెపి ప్రయత్నాలు సాగవు. బిజెపిని ఎదుర్కొనగల సత్తా రాహుల్‌కే ఉంది’ అని ఆయన అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, కేరళలోని వెంగరా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘అక్కడ బిజెపి నిర్వహించిన ర్యాలీలు చతికిలపడ్డాయి’ అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రజల నిలదీస్తున్నారని, మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంపాటు జనాన్ని మోసం చేయలేదని శశిథరూర్ చెప్పారు. కాంగ్రెస్‌లో రాహుల్ ఓ బలమైన శక్తిగా మారతారని, ఆ రోజులు దగ్గరున్నాయని ఆయన జోస్యం చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో జరిగిన ముఖాముఖిలో రాహుల్ ఓ పరిణతి చెందిన రాజకీయవేత్తగా వ్యవహరించారని థరూర్ పేర్కొన్నారు. అంతకుముందు ఏ రాజకీయ నేతకు లభించని మద్దతు, ఆదరణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా లభించిందని కాంగ్రెస్ ఎంపీ చెప్పారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టాక కొత్త ఎనర్జీ వస్తుందని ఆయన వెల్లడించారు. రొహింగ్యా ముస్లిం విషయంలో అంతర్జాతీయంగా భారత్‌కు చెడ్డపేరు వచ్చిందని మాజీ విదేశాంగశాఖ సహాయ మంత్రి విమర్శించారు. అమాయకులైన మహిళలు, చిన్నారులపై ఉగ్రవాదులుగా ముద్ర వేయడం దారుణమని ఆయన చెప్పారు.