జాతీయ వార్తలు

జనం గొంతు నొక్కలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, అక్టోబర్ 23: పటీదార్ నేతలతో బేరసారాలు చేస్తున్నారంటూ బిజెపి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన నవసర్జన్ జనదేశ్ మహాసమ్మేళన్‌లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన విమర్శల దాడికి దిగారు. ‘గుజరాతీయుల గొంతు నొక్కలేరు, అలాగే కొనలేరు’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ‘మీ దగ్గర బోలెడంత డబ్బు ఉండొచ్చు. ఎవరినైనా కొనుగోలు చేయొచ్చని అనుకోవచ్చు. అయితే గుజరాత్ ప్రజలను మీరు కొనలేరు. వారి గొంతు నొక్కలేరు’ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిప్పులు చెరిగారు. గాంధీనగర్‌లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ‘మోదీజీ గుజరాతీ ప్రజలు ముఖ్యంగా యువత అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి బహిరంగంగానే నిరసన తెలుపుతున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా యువత గళాన్ని ఆపలేరు. ఎంత ఖర్చుపెట్టినా వారి గళాన్ని కొనలేరు’ అంటూ విమర్శించారు. 22ఏళ్ల బిజెపి పాలనలో గుజరాత్ యువత ఉపాధి దూరమైందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదని, ఏ రంగం చూసినా వెనకబడిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిపోయిందన్న రాహుల్ ‘సామాన్యులు విద్యను కొనలేని స్థితిలో ఉన్నారు. ఇదంతా బిజెపి ప్రభుత్వ పుణ్యమే’ అంటూ విరుచుకుపడ్డారు. ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని అన్నారు. అమిత్ షా కుమారుడు జయ్ షాపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ‘ప్రతి వేదికపైనా అవినీతి గురించి ఉపన్యాసాలు దంచే నరేంద్ర మోదీ జయ్ షా వ్యవహారంపై వౌనం వహిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. జయ్ అవినీతిపై ప్రధాని స్పందన చూద్దామని దేశం యావత్తూ వేచిచూస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘మీరు ఎన్నో విషయాలు మాట్లాడతారు. అవినీతి, అక్రమాలపై ప్రసంగాలు చేస్తుంటారు. అయితే జయ్ షా అవినీతి గురించి చిన్నమాట అనలేరు.. ఎందుకు?’ అని ఆయన నిలదీశారు.

చిత్రాలు..గాంధీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ.
ఆయన పక్కన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓబీసీ నేత అల్పేష్ థాకర్. *బహిరంగ సభకు హాజరైన జనం