జాతీయ వార్తలు

బిజెపికి పటీదార్ పోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 23: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన ఓటు వర్గమైన పటీదార్ వ్యవహారం బిజెపికి తలపోట్లు తెచ్చిపెడుతోంది. పటేల్ వర్గాన్ని క్యాష్ చేసుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. బిజెపికి అనుకూలంగా మారితే కోటి రూపాయలు ఇస్తానంటూ రాష్ట్ర బిజెపి చీఫ్ ఆశ చూపారంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉత్తర గుజరాత్ కన్వీనర్ నరేంద్ర పటేల్ రేపిన దుమారంతో, రాష్ట్ర నాయకత్వం చిక్కుల్లో పడింది. కొద్ది నెలల క్రితమే బిజెపిలో చేరిన పాస్ ఉద్యమ నాయకుడు నిఖిల్ సవాని బిజెపిని తిట్టిపోస్తూ రాజీనామా చేయడం తెలిసిందే. ‘రిజర్వేషన్ల విషయంలో పటీదార్ వర్గానికి న్యాయం చేస్తామన్న హామీ మీదటే బిజెపిలో చేరాను. కానీ, అక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు’ అంటూ నిఖిల్ బిజెపి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా, పాస్ ఉత్తర గుజరాత్ కన్వీనర్ నరేంద్ర పటేల్ అన్యూహ్యమైన నిర్ణయం తీసుకోవడం కూడా రాష్ట్ర బిజెపిని ఇరుకున పడేసినట్టయ్యింది. ఆదివారంనాటి పరిణామాల్లో పటేల్ కమ్యూనిటీ రిజర్వేషన్ల సాధనకు బిజెపిలో చేరుతున్నట్టు పార్టీ అధ్యక్షుడు జీతు విజ్ఞాని సమక్షంలో ప్రకటించిన నరేంద్ర, రెండు గంటలు తిరగకుండానే మీడియా ముందు బిజెపిని దుమ్మెత్తిపోశారు. పటేల్ ఉద్యమ కృషిని పార్టీకి తాకట్టుపెట్టడానికి బిజెపి కోటి రూపాయలు ఆశ చూపిందంటూ దుమారం లేపారు. అయితే, రిజర్వేషన్ల సాధనకు ఉద్యమాన్ని తాకట్టుపెట్టే ప్రసక్తే లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. అనూహ్య పరిణామాలతో కౌంటర్‌లోపడిన బిజెపి, అదంతా తెరవెనుక నుంచి కాంగ్రెస్ ఆడిస్తోన్న ‘డ్రామా’గా కొట్టిపారేసింది. ‘పాస్ ఆరోపణలన్నీ అవాస్తవం. రాజకీయ లబ్దికోసం నరేంద్రను ముందుపెట్టి కాంగ్రెస్ తెరవెనుక నుంచి ఆడిస్తోన్న డ్రామా. ఆయనంతట ఆయనే బిజెపిలో చేరతానంటూ వచ్చాడు. గంటల వ్యవధిలోనే యు టర్న్ తీసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే, ముందస్తు ప్రణాళికతో సాగిన డ్రామాలా కనిపిస్తోంది’ అని గుజరాత్ బిజెపి అధికార ప్రతినిధి భరత్ పాండ్యా వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, నరేంద్ర పటేల్ పది లక్షల నగదు చూపిస్తూ, అది బిజెపి తనకిచ్చిన అడ్వాన్స్‌గా చెప్పుకొచ్చారు. మిగిలిన 90 లక్షల రూపాయలు 24 గంటల్లో ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనికంతటికీ బ్రోకర్‌గా బిజెపితో చేతులు కలిపిన పాస్ ఉద్యమ నేత వరుణ్ పటేల్ పని చేశాడని ఆరోపించారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్ కోటా పెంచాలంటూ పెద్దఎత్తున ఉద్యమించిన హార్దిక్ పటేల్‌కు కీలక అనుచరులైన వరుణ్ పటేల్, రేష్మ పటేల్ శనివారం నాటి పరిణామాల్లో బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. గుజరాత్ సిఎం విజయ్ రూపాని, డిప్యూటీ సిఎం నితిన్ పటేల్ సమక్షంలో వీరిద్దరూ పార్టీ తీర్థం తీసుకున్నారు. అయితే, పటేల్ ఉద్యమ వర్గాన్ని తమవైపు తిప్పుకోడానికి బిజెపి వేస్తున్న ఎత్తులను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. గత వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ పాస్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ను ఆహ్వానించిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్‌సిన్హా సోలంకి, తాము అధికారంలోకి వస్తే పాస్ డిమాండ్లకంటే అదనంగా 20 శాతం రిజర్వేషన్ కోటా పెంచుతామంటూ ప్రకటించడం తెలిసిందే.

చిత్రం..నరేంద్ర పటేల్