జాతీయ వార్తలు

మహిళా బిల్లుకు మోక్షం కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రానికి సూచించాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు అఖిల భారత మహిళా కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితదేవ్ నేతృత్వంలో మహిళ కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరించిన 33లక్షల సంతకాలను వారు రాష్టప్రతికి అందజేశారు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు నగ్మా, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, తెలంగాణ ఎమ్మెల్సీ అకుల లలిత తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం నేరేళ్ల శారద మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంవల్ల బిల్లును ఆమోదించేయలేక పోయిందని, ఏన్డీయేకి పూర్తి మెజారీటీ ఉన్నందున ఈ బిల్లును త్వరగా ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన మహిళా కాంగ్రెస్ నేతలు