జాతీయ వార్తలు

గవర్నర్‌తో మెహబూబా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, మార్చి 26: పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ శనివారం కాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాతో సమావేశమై రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. తర్వాత ఆమె కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు మద్దతు తెలియజేసినందుకు బిజెపికి కృతజ్ఞతలు తెలియజేశారు. జమ్మూ, కాశ్మీర్‌లో శాంతి, సమన్వయం, అభివృద్ధే తమ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తేదీని తర్వాత
ఖరారు చేస్తామన్నారు. బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు నిర్మల్ సింగ్ కూడా గవర్నర్‌ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెహబూబా ముఫ్తీకి మద్దతు తెలియజేస్తూ బిజెపినుంచి ఒక లేఖను ఆయనకు అందజేశారు. కాగా, కొత్త ప్రభుత్వంలో శాఖల పంపిణీకి సంబంధించి పిడిపి, బిజెపి మధ్య విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన పుకార్లను నిరాధారమైనవని పిడిపి కొట్టివేసింది. ‘పిడిపి, బిజెపి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఇంకా జరుగుతున్న సమయంలో శాఖల పంపిణీపై విభేదాలు తలెత్తినట్లు వస్తున్న పుకార్లు నిరాధారమైనవి’ అని పిడిపి ప్రధాన అధికార ప్రతినిధి నరుూమ్ అఖ్తర్ స్పష్టం చేశారు.