జాతీయ వార్తలు

మాంఝీ కాన్వాయ్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ, మే 26: హిందూస్తానీ అవాం మోర్చా అధ్యక్షుడు, బిహార్ మాజీ సిఎం జితన్ రాం మాంఝీ కాన్వాయ్‌పై గురువారం దాడి జరిగింది. ఎల్‌జెపి నేత హత్యకు నిరసగా ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఎల్‌పిజి నేత సుదేశ్ పాశ్వాన్, ఆయన కజిన్ సునీల్ పాశ్వాన్‌ను బుధవారం మావోయిస్టులు హత్యచేశారు. హంతకులను తక్షణం అరెస్టు చేయాలంటూ ఆందోళనకుదిగిన జనం మాంఝీ కాన్వాయ్‌పై దాడి చేశారు. రాళ్ల వర్షం కురిపించి, రెండు బైక్‌లు, మాంఝీ కాన్వాయ్‌లోని జీపునకు నిప్పుపెట్టారు. అయితే మాజీ సిఎం మాంఝీ సురక్షితంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదని మగధ్ రేంజ్ డిఐజి సౌరభ్ కుమార్ వెల్లడించారు. మాజీ సిఎం కాన్వాయ్ దుమారియా మోరా పట్టణంలోకి చేరగానే స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కాన్వాయ్ వెంటబడి రాళ్ల దాడి చేశారు. అక్కడినుంచి ప్రదర్శనగా వెళ్లి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగినట్టు డిఐజి తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఆందోళనకారుల దాడిలో అడిషనల్ ఎస్‌పి మనోజ్ యాదవ్ తలపై గాయమైంది. పలువురు పోలీసులకు గాయాలయ్యాయని సౌరభ్ కుమార్ చెప్పారు. ఎఎస్‌పిని గయా ఆసుపత్రికి తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎల్‌జిపి నేత హత్య నేపథ్యంలో గయాలో అదనపుబలగాలను మోహరించారు.

chitram ఎల్‌జెపి నేత హత్యకు నిరసగా గయలో గురువారం జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన సిఆర్‌పిఎఫ్ జవాన్లు