జాతీయ వార్తలు

పిఎంఓ కాదు.. ట్రావెల్ ఏజెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీగా మారిపోయిందని, దాని స్థాయిని దిగజార్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీ సర్కార్ రెండేళ్ల పాలనపై స్పందిస్తూ దేశంలో అవినీతి, దౌర్జన్యం పెచ్చరిల్లిందని ఆరోపించింది. అభివృద్ధి పేరుతో దేశ ప్రజలు మోదీకి పట్టం కట్టారని, కానీ పిఎంఓను ట్రావెల్ ఏజెన్సీగా అభివృద్ధి చేయడం మినహా ఇతరత్రా అభివృద్ధి ఏదీ చోటుచేసుకోలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. విదేశాల్లో వరుసగా పర్యటిస్తున్న ప్రధాని మోదీ కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించడానికే పిఎంఓ అధికారులు పరిమితమైపోయారని, ఒక్కముక్కలో చెప్పాలంటే ట్రావెల్ ఏజెంట్లుగా మారిపోయారని ఆమ్ ఆద్మీ నాయకుడు దిలీప్ పాండే ఆరోపించారు. విదేశీ పర్యటనల వల్ల భారత్‌తో ఆయా దేశాల అనుబంధం పెరగాలనీ, కానీ పాకిస్తాన్, చైనా, నేపాల్‌తో సంబంధాలు ఎందుకు బెడిసికొట్టాయని పాండే ప్రశ్నించారు. విదేశాంగ విధానంలో స్పష్టత, పారదర్శకత కొరవడిందని, అలాంటి పరిస్థితుల్లో విదేశీ పర్యటనల వల్ల ఒనగూడే ప్రయోజనం శూన్యమని పాండే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వ్యాప్తి కోసమే ఇదంతా చేస్తోందని పాండే ఆరోపించారు.