జాతీయ వార్తలు

పుదుచ్చేరి సిఎంగా నారాయణస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, మే 28: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వి నారాయణస్వామి శనివారం పుదుచ్చేరి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన పుదుచ్చేరికి పదో ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమయింది. సిఎల్‌పి నాయకుడిగా నారాయణ స్వామి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు కొత్తగా ఎన్నికయిన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించడం కోసం అధిష్ఠానవర్గం పంపించిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌లు సమావేశం అనంతరం విలేఖరులకు చెప్పారు. నారాయణస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి కొత్తగా ఎన్నికయిన పార్టీ ఎమ్మెల్యేలంతా అంగీకరించారని, ఆయనను సిఎల్‌పి నాయకుడిగా ఎన్నుకున్నారని వారు చెప్పారు. నారాయణస్వామి పేరును పిసిసి అధ్యక్షుడు ఎ నమశ్శివాయం ప్రతిపాదించగా, మాజీ ముఖ్యమంత్రి వైద్యలింగం సమర్థించారని షీలా దీక్షిత్ చెప్పారు. అంతా సాఫీగా జరిగిపోయిందని, సోనియా గాంధీ ఫోన్‌లో నారాయణ స్వామిని అభినందించారని ఆమె తెలిపారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ తొలి ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా, రెండోసారి పిఎంఓలో సహాయ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి ఈ నెల 16న జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఆయన ఇప్పుడు ఉప ఎన్నికలో గెలవాల్సి ఉంది. కాగా, ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి, పిసిసి అధ్యక్షుడు నమశ్శివాయం మధ్య గట్టి పోటీ ఉండింది. అయితే చివరికి అధిష్ఠానం అనుభవజ్ఞుడైన నారాయణస్వామి వైపే మొగ్గింది. కాగా, తదుపరి చర్యపై తాను పార్టీ ఎమ్మెల్యేలు, అధిష్ఠానంతో చర్చిస్తానని సమావేశం అనంతరం నారాయణస్వామి విలేఖరులకు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్‌ను కలుస్తానని కూడా ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 15 సీట్లు దక్కించుకోగా, దాని మిత్రపక్షమైన డిఎంకెకు రెండు సీట్లు లభించాయి. కాగా మంత్రివర్గం సైజు,మంత్రివర్గంలో డిఎంకె సభ్యులను చేర్చుకోవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని నారాయణస్వామి చెప్పారు.