జాతీయ వార్తలు

ఆర్‌పార్ శ్యామా ఇక లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: ఆర్‌పార్, బర్సాత్‌కీ రాత్, మిలన్, శారద సహా దాదాపు 175 చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి అలనాటి ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి శ్యామా (82) మంగళవారం నాడిక్కడ కన్నుమూశారు. గురుదత్ కథానాయకుడిగా నటించి ఆర్‌పార్ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. శారద చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. తన తల్లి గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ వచ్చారని, మంగళవారం ఆరోగ్యం క్షీణించిందని శ్యామ కుమార్తె తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ముంబయిలోని మెరీనా లైన్స్‌లో శ్యామా అంత్యక్రియలు జరిగాయి.