జాతీయ వార్తలు

సుఖోయ్ వేగం.. బ్రహ్మోస్ తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: శత్రుప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి నిర్దేశిత లక్ష్యాలను చేధించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా భారత్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఇందులో భాగంగానే అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యం కలిగిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని సుఖోయ్ ఎస్‌యు- 30 యుద్ధ విమానం ద్వారా పరీక్షించేందుకు సన్నద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాల కథనం. ఈ పరీక్షకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, పరీక్ష విజయవంతమైతే సుదూర లక్ష్యాలను సైతం భారత్ ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఢీకొని ధ్వంసం చేయగలుగుతుందని వెల్లడించాయి.
శత్రు లక్ష్యాలను గురిపెట్టి చేధించగలిగే భారత సామర్థ్యం ఈ పరీక్ష విజయవంతంతో మరింత ఇనుమడిస్తుందని వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణులు లక్ష్యాలను గురి తప్పకుండా ఢీకొనకలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నవని, వీటిని సుఖోయ్ యుద్ధ విమానం ద్వారా ప్రయోగిస్తే శత్రుదేశాల్లోని లక్ష్యాలు ఎంత దూరంలోవున్నా ధ్వంసం చేయడం సాధ్యమవుతుందని వెల్లడించాయి. అంటే, 3200 కిలోమీటర్లపాటు ఆగకుండా ప్రయాణం చేయగలిగే సుఖోయ్ విమానం, బ్రహ్మోస్ క్షిపణులు ఒక్కటిగా ముందుకు సాగితే అది భారత సైనిక దళాలకు తిరుగులేని శక్తిసామర్థ్యాలను సంతరింపచేసేదే అవుతుందని వెల్లడించాయి. గత ఏడాదే సుఖోయ్ యుద్ధ విమానాల ద్వారా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే పరీక్ష నిర్వహించారు. ధ్వనికంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలిగే బ్రహ్మోస్ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను చేధించగలుగుతుంది. ఇలాంటి క్షిపణిని సుఖోయ్ యుద్ధ విమానం ద్వారా పరీక్షించాలన్న నిర్ణయం రక్షణపరంగా ఓ వ్యూహాత్మక ముందుడుగేనని నిపుణులు అంటున్నారు. సుఖోయ్ -బ్రహ్మోస్‌లు సమ్మిళితంగా భారత సైన్యం ముందుకు సాగితే, వైమానిక శక్తి ఎన్నో రెట్లు ఇనుమడిస్తుందని, అతి తక్కువ దూరం నుంచి శత్రు దేశాల్లోని కీలక స్థావరాలను క్షణాల్లో ధ్వంసం చేయడమూ సాధ్యమవుతుందని వెల్లడించాయి.