జాతీయ వార్తలు

నాట్ బిఫోర్ మీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఆంధ్ర, తెలంగాణ సివిల్ న్యాయమూర్తులు, న్యాయాధికారుల విభజనకు సంబంధించిన కేసుపై విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ నిరాకరించారు. చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించటం తెలిసిందే. నాలుగు వారాల నుండి విచారణ కొనసాగిస్తున్న చలమేశ్వర్ మంగళవారం అకస్మాత్తుగా ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ దాదాపుగా పూర్తయింది. ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. అయితే చలమేశ్వర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనముందు విచారణ వద్దు అని స్పష్టమైన ప్రకటన చేయటంతో అందరూ అవాక్కయ్యారు. రెండో కోర్టులో ఈ కేసు విచారణకు రావలసి ఉండింది, అయితే కేసుల జాబితాలో ఈ కేసు లేకుండాపోవటంతో పిటిషనర్ హమీదుద్దీన్ తరపు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ దీని గురించి ప్రస్తావించారు. వెంటనే చలమేశ్వర్ బదులిస్తూ ‘నాట్ బిఫోర్ మీ’ అని స్పష్టం చేశారు. ఇంతకాలం నుండి ఈ కేసును విచారిస్తున్న చలమేశ్వర్ అకస్మాత్తుగా అలా ఎందుకు చెప్పారనేది ఎవరికి అర్థం కావటం లేదు.