జాతీయ వార్తలు

లెక్కలకు రెక్కలొస్తే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: పొద్దస్తమానం టీవీల ముందు కూర్చుని కామిక్స్ చూడకపోతే ఏం.. కాస్త పుస్తకం తీసి లెక్కలు ప్రాక్టీస్ చేయొచ్చుగా అంటూ అమ్మ పెట్టే చివాట్లు చాలా ఇళ్లలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే, అలాంటి పిల్లలకే లెక్కలు బాగా వంటపడతాయన్న అధ్యయనాలను ఆ తల్లులకు వినిపిస్తే ఏమంటారో చూడాలి? అయితే, ఇక్కడ చూడాల్సిన కామిక్స్ ఏ పిచ్చివో కాదు, క్యూమ్యాథ్స్ డిజైన్ చేసిన మోషన్ కామిక్స్ అంటున్నారు రూపకర్తలు. పిల్లలకు లెక్కలు బాగా వంటబట్టడానికి వీలుగా మోషన్ కామిక్ పేరిట ఓ మొబైల్ యాప్‌ను రూపొందించారు. బెంగళూరు ఆధారంగా పనిచేస్తున్న క్యూమ్యాథ్స్ స్టార్టప్ ఒకటి కొత్త కామిక్ సిరీస్‌ను డెవలప్ చేసి మార్కెట్‌కు తెస్తోంది. ఈ మొబైల్ యాప్‌లోని టీచింగ్ మెథడ్స్‌ను అనుసరిస్తే, కామిక్స్‌ని ఎంజాయ్ చేస్తూనే పిల్లలు లెక్కల్లో ఆరితేరిపోవడం ఖాయమని అంటున్నారు యాప్ రూపకర్తలు. లెక్కల్లో విద్యార్థుల సామర్థ్యం పెంచే ఉద్దేశంతో కె-2, 3-5, 6-8 తరగతులుగా పిల్లలను విభజించి, వారికోసం ‘మేథమెటికల్ యూనివర్శ్’ పేరిట కామిక్స్ అనుసంధానిత సిలబస్ రూపొందించినట్టు చెబుతున్నారు. ‘విద్యార్థులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతే ఈ ప్రాజెక్టును రూపొందించాం. ఈ సిలబస్ పిల్లల్లో లెక్కల ఆసక్తిని పెంచడమే కాదు, సబ్జెక్టులో వాళ్ల సామర్థ్యాలకు మరింత పదును పెడుతుంది’ అని క్యూమ్యాథ్స్ వ్యవస్థాపక సిఇవో మనన్ కుర్మ వెల్లడించారు. నలుగురు సభ్యుల బృందం అభివృద్ధి చేసిన ఈ మోషన్ కామిక్స్‌ను, పీరియాడికల్‌గా క్యూమ్యాథ్స్ నిర్వహిస్తున్న విద్యా కేంద్రాల వద్ద మార్కెట్‌కు అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ‘ఊహా ప్రపంచంలో పిల్లలు చూసే అనేక పాత్రలను చాలా స్పష్టంగా ఇందులో పొందుపర్చాం. ఏ వయసు పిల్లలనైనా ఇట్టే ఆకట్టుకునే ఈ పాత్రల్ని ఒక్కసారి చూస్తే, స్థిరంగా మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయని రూపకర్తలు వివరించారు.