జాతీయ వార్తలు

తుగ్లక్ హయాంలోనూ నాణేలను రద్దు చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 15: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీపై మళ్లీ మాటల దాడి చేశారు. 14వ శతాబ్దానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్లను రద్దు చేశాడని గుర్తుచేస్తూ, మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి ఒరిగిందేమీలేదన్నారు. ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 3.75 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగిందన్నారు. ‘గతంలో ఎంతోమంది రాజులు సొంతంగా కరెన్సీని ప్రవేశపెట్టారు.. కొంతమంది పాత కరెన్సీని యథాతథంగా ఉంచుతూ కొత్త కరెన్సీని తెచ్చారు.. అయితే- 700 ఏళ్ల క్రితం తుగ్లక్ మాత్రం సొంత నాణాలను తెచ్చి పాతవాటిని రద్దు చేశాడు.. ఈ కారణంగా నోట్లరద్దు అనుభవం ఈ దేశంలో 700 ఏళ్లకు ముందే ఉంది.. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చడంలో అపఖ్యాతి పాలైన తుగ్లక్ కరెన్సీని రద్దు చేయడంలోనూ పేరు సంపాదించాడు..’ అని సిన్హా వివరించారు.
‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన నోట్లరద్దుపై, వస్తు సేవా పన్ను (జిఎస్టీ)పైన తన మనోభావాలను వెల్లడించారు. ఈ దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్య అని, ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు ఏదో ఒకటి చేయాల్సిన తరుణం ఇదేనని అన్నారు. నోట్లరద్దు అనంతరం కొత్తనోట్ల ముద్రణకు 1,28,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నోట్లరద్దు వల్ల ప్రత్యక్షంగా 3.75 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగిందన్నారు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు ఆర్థికమంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా నోట్లరద్దు, జిఎస్టీలను ‘మీడియా వేడుకలు’గా అభివర్ణించారు. ఏది చేసినా మీడియాలో ప్రచారం కోసం చేసే రోజులొచ్చాయని, మనం చేసిన దాన్ని గతంలో ఎవరూ చేయలేదన్న భావన కూడా ఇప్పటి నేతల్లో అధికమైందన్నారు. ‘వాజపేయి హయాంలోనూ ఎన్నో మంచి పనులు జరిగాయి. ఏమీ చేయకుండా ఉంటే ఆయనకు ‘్భరతరత్న’ పురస్కారం ఇచ్చేవారా?’ అని ప్రశ్నించారు.