జాతీయ వార్తలు

గుజరాత్‌లో సెక్స్ వీడియోల రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో సెక్స్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్, ఆయన అనుచరులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్పింగ్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది. హార్దిక్ పటేల్ మహిళలు, మందు సీసాలు ఉన్న మొత్తం ఐదు సెక్స్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. మరో నాలుగు వీడియోలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓడిపోతామేమోనన్న భయంతోనే బీజేపీ ఈ వీడియా నాటకాలు ఆడుతోందని హార్దిక్ పటేల్ ఆరోపిస్తుంటే, బీజేపీ మాత్రం ఆ వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది. హార్దిక్ పటేల్ వారం రోజుల క్రితమే తనను అపఖ్యాతిపాలు చేసేందుకు కొన్ని అభ్యంతరకరమైన వీడియోలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఒక ప్రకటన చేశారు. ఆయన అన్నట్టే పదిరోజుల్లో నాలుగు సెక్స్ వీడియోలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ ఐదు వీడియోల్లో హర్దిక్ పటేల్, ఆయన అనుయాయులు ఓ హోటల్ బెడ్ రూంలో మహిళలతో ఉండగా తీసినవే. హార్దిక్ వాటిపై తీవ్రంగానే స్పందించారు. ‘నేను నపుంసకుడిని కాదు.. మగవాడిని’ అని వ్యాఖ్యానించారు.
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్న వారిపై కోర్టుకు వెళతానని ఆయన హెచ్చరించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చెడ్డ అలవాటు బీజేపీకి ఉందని ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. గత 25 సంవత్సరాల్లో ఏమీ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామన్న అక్కసుతోనే 23ఏళ్ల యువకుడి జీవితంతో బిజెపి ఆడుకుంటోందని ఆయన అన్నారు. సెక్స్ వీడియాలు విడుదల చేసిన వారిపై త్వరలోనే పరువు నష్టం కేసు దాఖలు చేస్తానని ఆయన చెప్పారు. తనను అప్రతిష్టపాలు చేసినంత మాత్రాన పటీదార్ ఉద్యమం ఆగదని, తాను చెడ్డవాడిని కావచ్చుకానీ- దీనికీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. పటేల్ వర్గానికి బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఆయన ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ వీడియోల గురించి ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు, కానీ శీలంలేని నాయకులను ఎలా ఎన్నుకుంటారంటూ హార్దిక్ పటేల్‌పై పరోక్షంగా దాడి చేస్తోంది.
ఇదిలా ఉంటే పాస్ మాజీ కన్వీనర్ అశ్వినీ పటేల్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి హార్దిక్‌పై పలు ఆరోపణలు చేశారు. హార్దిక్ పాస్‌కు చెందిన యువతులను వాడుకున్నారని బహిరంగ ఆరోపణ చేశారు. సూరత్, మోర్బి, రాజ్‌కోట్ నగరాలలోని హార్దిక్ పటేల్ అనుయాయులు కూడా ఇలాంటి నీతిమాలిన పనులు చేశారని ఆయన వెల్లడించారు. హార్దిక్ పటేల్ పాస్ యువతులను ఉపయోగించుకున్న కొన్ని వీడియోలు తన వద్దా ఉన్నాయనీ, వాటిని త్వరలోనే విడుదల చేస్తానని అశ్విన్ చెబుతున్నారు. మరోపక్క హార్దిక్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే బిజెపి లోపాయకారిగా ఈ సెక్స్ వీడియోలను విడుదల చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జ్ అశోక్ గెహ్లోట్ ధ్వజమెత్తారు.
బీజేపీ బురద రాజకీయాలు చేస్తోందని గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్‌సింగ్ సోలంకి విమర్శించారు. ఆదివాసీ యువనాయకుడు జిగ్నేష్ మెవానీ కూడా హార్దిక్ పటేల్‌కు మద్దతు పలికారు. ‘సెక్స్ వీడియోలకు భయపడవద్దు. నేను మీతో ఉన్నాను. సెక్స్ జీవితం పూర్తిగా వ్యక్తిగతమైంది, అది ప్రాథమిక హక్కు కిందకే వస్తుంది’ అంటూ హార్దిక్ పటేల్‌కు బాసటగా నిలిచారు. కొంతకాలం క్రితం వరకు హార్దిక్ పటేల్‌కు అత్యంత సన్నిహితుడైన చిరాగ్ పటేల్ అతనిపై దుమ్మెత్తిపోశారు. హార్దిక్ పటేల్ ఇప్పటికైనా ఉద్యమం నుంచి తప్పుకోవాలని చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ డిమాండ్ చేశారు.