జాతీయ వార్తలు

లాస్‌వేగాస్ దాడిని మరిపించేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: భారత్‌లో త్వరలో జరిగే కుంభమేళాపైన, కేరళలో నిర్వహించే ‘త్రిసూర్ పూరమ్’ వేడుకలపైన దాడి చేస్తామని ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ హెచ్చరించింది. అమెరికాలోని లాస్‌వేగాస్ నగరంపై దాడి చేసిన రీతిలోనే కుంభమేళా, త్రిసూర్ పూరమ్‌పై తమ ప్రతాపం చూపుతామని మళయాల భాషలో పది నిమిషాల నిడివి ఉన్న ఆడియో టేపును ‘ఐసిస్’ విడుదల చేసినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయ. లక్షలాది భక్తుల రద్దీతో కిటకిటలాడే కుంభమేళా, త్రిసూర పూరమ్‌పై దాడికి వ్యూహరచన చేస్తున్నట్లు ఆ ఆడియోలో ఐసిస్ హెచ్చరించింది.
భారత్‌లో దాడి జరిపి తీరుతామని హెచ్చరిస్తూ మగ గొంతుతో ఉన్న ఆ ఆడియో ‘దౌలతుల్ ఇస్లాం’ (ఓ ప్రాంతీయ ఐసిస్ విభాగం) నుంచి విడుదలైనట్టు తెలుస్తోంది. లాస్ వేగాస్‌లో ఓ సంగీత విభావరిపై తాము దాడి చేయగా ఎంతోమంది మరణించిన విషయాన్ని ఆడియోలో ప్రస్తావించడం గమనార్హం. ‘మీ మేధస్సును ఉపయోగించండి.. ఆహారంలో విషం కలపండి.. ట్రక్కులతో కుంభమేళాపై, త్రిసూర్ పూరమ్‌పై దాడి చేయండి.. మన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దాడులెన్నో చేసింది.. లాస్ వేగాస్‌లో మన మద్దతుదారులు ఎంతోమందిని హతమార్చారు.. మీరు కనీసం ఓ రైలును పట్టాల నుంచి తప్పించండి.. కనీసం కత్తిని వాడండి..’ అంటూ ఓ మగ గొంతు ఐసిస్ మద్దతుదారులకు సూచించినట్లు ఆడియో టేపులో ఉంది. లాస్ వేగాస్‌లో ఓ సంగీత విభావరికి సుమారు 22వేల మంది హాజరు కాగా ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఐసిస్ పేరిట ‘టెలిగ్రామ్ మెసెంజర్’ ద్వారా ఆ ఆడియో క్లిప్ వచ్చిందని, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి దీన్ని పంపించినట్లు గుర్తించామని కేరళ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆడియోలో ఉన్న మగ గొంతు రషీద్ అబ్దుల్లా అనే ఐసిస్ నాయకుడిది అని, కసరగొడ్‌కు చెందిన ఇతను ఉగ్రవాద కలాపాల్లో చేరేందుకు ఆఫ్ఘన్ వెళ్లిపోయాడని తెలుస్తోంది. రషీద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గతంలోనే వివిధ సెక్షన్ల కింద తీవ్ర అభియోగాలను నమోదు చేసింది. రషీద్‌పై ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ కూడా జారీ అయింది. ముంబయిలో ఉంటున్న రషీద్, అతని భార్య, కుమారుడు కనిపించకుండా పోయారంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుల సంగతి వెలుగు చూసింది. కేరళ నుంచి ఇటీవలి కాలంలో దాదాపు వందమంది ఐసిస్‌లో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 300 ఆడియో టేపులను, వాట్సాప్ సందేశాలను, మెసేజింగ్ అప్లికేషన్లను, వివిధ సామాజిక మాధ్యమాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ‘నమ్మకం లేని వారు ఉండే స్థలం’ (దారుల్ కఫ్)్ర నుంచి ‘నమ్మకం కలిగిన వారు ఉండే చోటు’ (దారుల్ ఇస్లాం)కు ముస్లింలు వలస పోవాలని కూడా ‘ఐసిస్’ ఆడియోలో సూచన చేశారు. కాగా, ఈ ఆడియో టేపులను తీవ్రంగానే పరిగణించాలని, భారత్ సహా యూరప్, మధ్య ఆసియాలో విధ్వంసం సృష్టించాలని ఐసిఎస్ పన్నాగం పన్నిందని నిఘా విభాగం అధికారులు చెబుతున్నారు. ఐసిస్ ఆడియోపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు కేరళ డిజిపి లోక్‌నాథ్ బెహరా తెలిపారు.