జాతీయ వార్తలు

అధిక వసూళ్లకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: జీఎస్‌టీ రేట్లను తగ్గించిన తరువాత కూడా ప్రజలకు ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయించి అతిలాభం సంపాంచేందుకు ప్రయత్నించే వ్యాపారస్థుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ (ఎన్‌ఏఏ)ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఏఏ అధ్యక్షుడు, సాంకేతిక సభ్యుల నియామకానికి ఆమోదముద్ర వేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన అస్సాం రాజధాని గౌహతిలో ఇటీవల జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు వస్తువులపై పన్నును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించటం తెలిసిందే. ఈ తగ్గించిన లాభం వినియోగదారులకు అందేలా చూసేందుకే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఏఏను ఏర్పాటుచేసింది. జీఎస్‌టీ సమాఖ్య పలు వస్తువులపై పన్ను బాగా తగ్గించినా వ్యాపారస్థులు మాత్రం ఈ వస్తువులను పాత రేట్ల ప్రకారమే విక్రయించి అధిక లాభాలను గడిస్తున్నారు. యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అథారిటీలో చైర్మన్‌తోపాటు నలుగురు సాంకేతిక సభ్యులుంటారు. జీఎస్‌టీ మండలి ఇటీవల 178 వస్తువులు, సేవలపై పన్నును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. 28 శాతం పన్ను పరిధిలో ఇప్పుడు కేవలం యాభై వస్తువులు, సేవలు మాత్రమే ఉన్నాయి. కొన్ని వస్తువులను 18 శాతం పన్ను పరిధి నుండి పనె్నండు శాతం పరిధికి తెచ్చింది. ఆయా వస్తువులు, సేవలపై ఉన్న పన్ను ప్రకారమే వాటిని విక్రయించేలా చూడటం ఎన్‌ఏఏ అథారిటీ ప్రధాన బాధ్యత. ఈ లక్ష్య సాధనకోసం జాతీయ స్థాయిలో ఎన్‌ఏఏ పనిచేస్తే రాష్టస్థ్రాయిలో స్టాండింగ్ కమిటీలు, స్టీరింగ్ కమిటీలు పనిచేస్తాయి. తగ్గించిన జీఎస్‌టీ రేట్ల ప్రకారం కాకుండా పాత రేట్ల ప్రకారం వస్తువులను విక్రయిస్తే వారిపై ఫిర్యాదు చేసే అధికారం వినియోగదారులకు ఉంటుంది. వినియోగదారులు జాతీయ స్థాయిలో ఎన్‌ఏఏకు, రాష్ట్ర స్థాయిలో స్టాండింగ్ లేదా స్క్రీనింగ్ కమిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుల ఫిర్యాదులపై డైరెక్టర్ జనరల్ సేఫ్‌గార్డ్స్ (సీబీఈసీ) దర్యాప్తు చేసి తమ నివేదికను ఎన్‌ఏఏకు అందజేస్తుంది. ఎన్‌ఏఏ ఈ నివేదిక ఆధారంగా ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారస్థులపై చర్యలు తీసుకుంటుంది.
పప్పు్ధన్యాల ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
పప్పు ధాన్యాల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేసింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మెరుగైన ధరలకు అమ్ముకునేలా వీలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఐటి, న్యాయ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన విధానాన్ని సమీక్షించేందుకు, అలాగే స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు, వాటి వాణిజ్య పరిమాణం, దేశీయంగా జరుగుతున్న ఉత్పత్తి, డిమాండ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎగుమతులు, దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించేందుకు సీసీఈఏ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీకి అధికారాన్ని కల్పించిందని ఆయన తెలిపారు.
*
కేటీయార్ సంకల్పం
మేటిగ కన్పట్టుచుండి మైమరపియన్
పోటీపడి జ్యోతిబసుతొ
దీటైన రికార్డునెక్కితీరున్ సీఎం!