జాతీయ వార్తలు

ఇటు అభివృద్ధి.. అటు హరితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ అవార్డును దక్కించుకుంది. ఇండియా టుడే సంస్థ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సర్వే-2017లో వివిధ రాష్ట్రాలకు గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలలో అవార్డులను ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రెండు పురస్కారాలు దక్కాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ-స్వచ్ఛత విభాగంలో పురస్కారం లభించగా, ఆ అవార్డును కేంద్ర జలవనరులు, రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్వీకరించారు. అలాగే అత్యంత వేగంగా
వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు లభించిన అవార్డును రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సర్వేలో అత్యుత్తమ రాష్ట్రాలలో హిమాచల్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. అనంతరం కేటీఆర్ విలేఖరులతో మాట్లాడుతూ ఇండియా టుడే ప్రకటించే అవార్డులలో గత మూడేళ్లలో ప్రతి ఏడాదీ తెలంగాణ రాష్ట్రం వివిధ విభాగాలలో అవార్డులను దక్కించుకుంటోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన విధంగానే తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు-డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా తెలంగాణకు లభించిన అవార్డును అందుకుంన్న రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు