జాతీయ వార్తలు

పీఓకే మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ పేర్కొన్నారు. భారత్ దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరూ అడ్డుకోజాలరని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడిగా విలేఖరులతో మాట్లాడుతూ గత భారత ప్రభుత్వాల తప్పిదాల వల్లనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇస్లామాబాద్ పాలనలో ఉండిపోయిందని అన్నారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్ హక్కు అని, అందువల్ల దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటే భారత్‌ను ఎవరూ అడ్డుకోజాలరని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి తిరిగి పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ అనుమతించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన మరుసటి రోజే హోంశాఖ సహాయ మంత్రి ఇలా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీఓకే పాకిస్తాన్‌కే చెందుతుందని ఫరూక్ అబ్దుల్లా గత వారం వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే.