జాతీయ వార్తలు

విరాళాలు వాపస్ చేస్తున్నా: కమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 16: తమిళనాడు రాజకీయాలపై ఇటీవల ఆసక్తి కనబరచిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తాను అభిమానుల నుంచి సేకరించిన విరాళాలను వెనక్కి ఇస్తున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో ఆయన ప్రస్తుతానికి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు లేనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఓ తమిళ వారపత్రికలో తాను రాస్తున్న ‘కాలమ్’లో కమల్ తన మనోగతాన్ని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ వ్యవస్థ లేకుండా విరాళాలను తనవద్ద ఉంచుకోవడం న్యాయ సమ్మతం కాదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం 57వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా రాజకీయ పార్టీ పేరును కమల్ ప్రకటిస్తారని ఆయన అభిమానులు ఎదురుచూశారు. అయితే, పార్టీ ఏర్పాటుకు మరికొంత కాలం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విరాళాలను వాపస్ చేస్తున్నట్టు కమల్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఇపుడు చర్చనీయాంశమైంది. విరాళలు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనపై ఎలాంటి సందిగ్ధత లేదని ఆయన స్పష్టం చేశారు. తన అభిమాన సంఘాల ద్వారా ఆయన ఇప్పటివరకూ 30 కోట్ల రూపాయల మేరకు విరాళాలను సేకరించారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు పేరును, తేదీని ఇంకా నిర్ణయించలేదని, పార్టీ పేరును నిర్ణయించాకే అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తామని కమల్ పేర్కొన్నారు. విరాళాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, తాను వెనకడుగు వేస్తున్నానని, డబ్బు అక్కర్లేదని భావించరాదన్నారు. కాగా, ఇటీవల తాను రాసిన ‘కాలమ్’లో ‘హిందూ ఉగ్రవాదం’ పదాన్ని వాడడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, తాను హిందూ కుటుంబం నుంచి రాలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. ‘హిందూ ఉగ్రవాదం’ అని తాను అన్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నారని, అయినా తాను క్షమాపణలు చెప్పానని ఆయన గుర్తుచేశారు. హిందువులు ‘పెద్దన్నల’ మాదిరి వ్యవహరించాలన్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు కుటుంబంలో పెద్దన్న వలే ఉండాలని, ఇతరులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే హిందువులు తప్పును సరిదిద్దుకోవాలన్నారు. కాగా, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు గత జూలైలో కమల్ ప్రకటించినా, విరాళాలు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఇపుడు ప్రకటించడంతో ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? అన్న అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి.