జాతీయ వార్తలు

మోదీని నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: రాఫెల్ యుద్ధ విమానాల దిగుమతి ఒప్పందంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ గురువారం ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ విభాగం సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతూ ‘మీరు ప్రతిరోజూ నన్ను ప్రశ్నలు అడుగుతారు, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను బదులిస్తాను, మీరు నన్ను ప్రశ్నలు అడిగినట్లే రాఫెల్ ఒప్పందంపై నరేంద్ర మోదీని ఎందుకు ప్రశ్నించటం లేదు, మొదట ఆయనను ప్రశ్నించండి’ అని విలేఖరులకు సూచించారు. నరేంద్ర మోదీ ఒక పారిశ్రామికవేత్తకు లాభం చేకూర్చేందుకు మొత్తం రాఫెల్ ఒప్పందాన్ని మార్చివేశారని రాహుల్ ఆరోపించారు. అలాగే నరేంద్ర మోదీని అడగవలసింది చాలా ఉన్నదని ఆయన మీడియాతో చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అక్రమ వ్యాపారం గురించి నరేంద్ర మోదీని ప్రశ్నించండి, మీరతన్ని ఎందుకు అడగటం లేదు? కారణం ఏమిటంటూ రాహుల్ గాంధీ మీడియాపై ప్రశ్నలు కురిపించారు. రాఫెల్ డీల్‌ద్వారా దేశాన్ని దోచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేసేందుకు దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవటంపై స్పందిస్తూ యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థ రాఫెల్ ఒప్పందంకోసం దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థతో సంయుక్త పరిశ్రమను ఏర్పాటు చేయటం ఏమిటని నిలదీశారు. యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థను ఎలా ప్రోత్సహిస్తారని ఆయన నిలదీశారు. నరేంద్ర మోదీ అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియాలో ‘సెల్ఫ్ రిలయన్స్’ అత్యంత ముఖ్యమైన భాగమంటూ రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ రిలయన్స్ సంస్థకు లాభం చేకూర్చేందుకే రాఫెల్ డీల్‌ను మార్చారని ఆయన ఆరోపించారు.

చిత్రం..ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ కార్యవర్గంతో
జరిగిన సమావేశానికి వస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.