జాతీయ వార్తలు

సార్వభౌమత్వ పరిరక్షణకు దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలంధర్, నవంబర్ 16: శాంతి కోసం అంకితభావంతో పని చేస్తున్నట్టే దేశ సార్వభౌమత్వ పరిరక్షణకూ భారత్ కట్టుబడి ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవిం ద్ స్పష్టం చేశారు. ఆదంపూర్ (పంజా బ్) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 223 స్క్వాడ్రన్, 117 హెలికాప్టర్ యూనిట్‌లో సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాయుసేనలో పనిచేస్తున్న వారి సేవలను కొనియాడారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ ఎదుగుదల విభిన్న పార్శ్వాలను కలిగి ఉందని, మన సాయుధ దళాల నైపుణ్యం, శక్తిసామర్థ్యాలు కూడా ఇందుకు కారణాలన్న వాస్తవాన్ని విస్మరించలేమన్నారు. సాయుధ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తునందునే తాము నిర్భయంగా నిద్రపోగలుగుతున్నామని పౌరులు భావిస్తున్నారని రాష్టప్రతి అన్నారు. శాంతి పరిరక్షణకు మనం అంకితమైనప్పటికీ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని ఆయన వివరించారు. విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాల ప్రాతిపదికగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ వర్థిల్లుతోందని, ఇందుకు త్రివిధ దళాలు తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నాయని అన్నారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 223 స్క్వాడ్రన్, 117 హెలికాప్టర్ విభాగాల విశిష్టతలను, సేవలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. భారతీయ వాయుసేనలో ఆదంపూర్ ఎయర్ ఫోర్స్ అకాడమీ అత్యంత పురాతనమైన, సమర్థవంతమైన విభాగం అన్నారు.